ETV Bharat / state

RS Praveen Kumar and Kodandaram under House Arrest : కొనసాగుతున్న గ్రూప్​-2 రగడ.. ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​, కోదండరాంల గృహనిర్బంధం - Group2 Test Controversy

RS Praveen Kumar and Kodandaram under House Arrest : ప్రభుత్వం పట్టింపులకు పోయి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడొద్దని.. వెంటనే గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలని టీజేఎస్ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. గ్రూప్‌-2 అభ్యర్థులకు మద్దతుగా ఇరువురు నేతలు వేర్వేరుగా నిరసన దీక్షలకు పిలుపునిచ్చారు. అప్రమత్తమైన పోలీసులు ముందుగానే వారిని గృహనిర్బంధం చేయగా.. వారి నివాసాల్లోనే దీక్షలు కొనసాగిస్తున్నారు.

Group-2 Postpone Protests in Telangana
RS Praveen Kumar and Kodandaram under House Arrest
author img

By

Published : Aug 12, 2023, 3:30 PM IST

RS Praveen Kumar and Kodandaram under House Arrest : గ్రూప్‌-2 వాయిదా వేయాలంటూ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇటీవల వేలాది మంది అభ్యర్థులు టీఎస్​పీఎస్సీ వద్ద నిరసనలు హోరెత్తించగా.. వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు వారికి మద్దతు తెలిపాయి. గ్రూప్‌-2 పరీక్షపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలంటూ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం గన్‌పార్కు వద్ద మౌనదీక్షకు సిద్ధమయ్యారు.

TSPSC Clarity on Group 2 Exams Postpone : 'గ్రూప్-2 పరీక్ష వాయిదాపై ఆగస్టు 14న నిర్ణయం'

మరోవైపు.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్‌ అమరవీరుల స్తూపం వద్ద దీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యారు. నేతల పిలుపుతో వివిధ ప్రాంతాల నుంచి గ్రూప్‌-2 అభ్యర్థులు పెద్దఎత్తున హైదరాబాద్‌కు చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు.. నిన్న రాత్రి నుంచి హైదరాబాద్‌ లక్డికాపూల్‌లోని బీఎస్పీ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. కార్యాలయం వైపు ఎవరూ రాకుండా దిగ్బంధం చేశారు.

Group-2 Postpone Protests in Telangana : ఆర్​ఎస్‌ ప్రవీణ్​కుమార్​ను ఆయన నివాసం నుంచి బయటికి రాకుండా పోలీసులు నిర్బంధించారు. పోలీసుల తీరును ఖండించిన ఆయన.. ఇంట్లోనే దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. అలాగే.. మౌనదీక్షకు సిద్ధమైన ఆచార్య కోదండరాంను పోలీసులు గృహనిర్బంధం చేశారు. బయటికి రాకుండా ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు.

Group-2 Candidates Protest on Exam Postpone : ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పలువురు విద్యార్థి సంఘాల నేతలను, అభ్యర్థులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అభ్యర్థులను గందరగోళానికి గురిచేసేలా ప్రభుత్వం పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవటం సరికాదని నేతలు సూచించారు. ఇప్పటికే పేపర్‌ లీకేజీలతో అయమోమయంలో ఉన్న వారిని.. ఒత్తిడిగి గురిచేసేలా వరుసగా పరీక్షలు నిర్వహిస్తే వారి జీవితాలు నాశనమవుతాయన్నారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోదండరాం కోరారు.

"ప్రభుత్వం పట్టింపులకు పోయి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడొద్దు. అభ్యర్థులను గందరగోళానికి గురిచేసేలా ప్రభుత్వం పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవటం సరికాదు. ఇప్పటికే పేపర్‌ లీకేజీలతో అయమోమయంలో ఉన్న వారిని.. ఒత్తిడిగి గురిచేసేలా వరుసగా పరీక్షలు నిర్వహిస్తే వారి జీవితాలు నాశనమవుతాయి. గ్రూప్​-2 పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి". - కోదండరాం, తెజస అధ్యక్షుడు

"టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనతో.. ప్రభుత్వం పబ్లిక్ పరీక్షలు నిర్వహించడంలో విఫలమైంది. లీకేజీ అనంతరం.. వరుసగా పరీక్షలు నిర్వహించడం సమంజసం కాదు. గ్రూప్-2 పరీక్ష తేదీని మూడు నెలలు పొడిగించాలి. కేసీఆర్​ తక్షణమే నిరుద్యోగులపై దృష్టిసారించి వారికి న్యాయం జరిగేలా చూడాలి. నిరుద్యోగులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపబోము". - ఆర్​ఎస్ ప్రవీణ్​కుమార్​, బీఎస్పీ నేత

RS Praveen Kumar and Kodandaram under House Arrest గ్రూప్​-2 రగడ.. ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​, కోదండరాంల గృహనిర్బంధం

Group-2 Candidates Petition in Telangana HighCourt : గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్

Group-2 Candidates Protest Hyderabad : గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థుల పోరుబాట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.