ETV Bharat / state

విద్యార్థిని దాతృత్వం.. అనాథ పిల్లలకు రూ.87వేల విరాళం - alekhya donation for orphans

విద్యార్థిని తన దాతృత్వాన్ని చాటుకున్న సంఘటన ఇది. మెరిడియన్ పాఠశాలలో చదువుతున్న అలేఖ్య తాను చిత్రలేఖనం ద్వారా సంపాదించిన నగదును అనాథ పిల్లలకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. సైబరాబాద్ పోలీసులు ఆపరేషన్ స్మైల్​లో భాగంగా అనాథ పిల్లలకు అందిస్తున్న తోడ్పాటుకు.. అలేఖ్య రూ.87వేలు అందించింది.

Rs 87,000 donation for orphans given by alekhya to cp sazzanar
విద్యార్థిని దాతృత్వం.. అనాథ పిల్లలకు రూ.87వేల విరాళం
author img

By

Published : Dec 15, 2020, 1:23 PM IST

బంజారాహిల్స్​లోని మెరిడియన్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని తన దాతృత్వాన్ని చాటుకుంది. చిత్రలేఖనం ద్వారా సంపాదించిన నగదును సైబరాబాద్ పోలీసులకు విరాళంగా ఇచ్చింది. ఆపరేషన్ స్మైల్​లో భాగంగా అనాథ పిల్లలకు సైబరాబాద్ పోలీసులు అందిస్తున్న తోడ్పాటుకు అలేఖ్య తన వంతుగా 87వేల రూపాయలను అందించింది.

సైబరాబాద్ సీపీ సజ్జనార్​కు ఈ నగదును నేరుగా అందించారు. ఆపరేషన్ స్మైల్​లో భాగంగా సైబరాబాద్ పోలీసులు వీధి బాలలు, బాల కార్మికులు, అనాథ పిల్లలను చేరదీసి.. వాళ్లకు స్వచ్ఛంద సంస్థల సాయంతో విద్య, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలేఖ్య దాతృత్వాన్ని సీపీ ప్రశంసించారు.

ఇదీ చూడండి: 'జైలు నుంచి విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పిస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.