ETV Bharat / state

రైతు వేదికల కోసం రూ.350 కోట్లు విడుదల - రైతు వేదికల నిర్మాణం

తెలంగాణ రైతన్నలకు సర్కారు మరో తీపి కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణం కోసం నిధులను విడుదల చేసింది. క్లస్టర్​ల పరిధిలో రైతులంతా ఒక చోట చేరి... సాగు విధానాలపై చర్చించుకోవడానికి వీలుగా రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

Hyderabad latest news
రైతు వేదికల కోసం రూ.350 కోట్లు విడుదల
author img

By

Published : Jun 5, 2020, 10:32 PM IST

Updated : Jun 6, 2020, 1:22 AM IST

రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2020-21 సంవత్సరానికి సంబంధించి 350 కోట్ల రూపాయల విడుదలకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్​ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ 2,630 రైతు వేదికలు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. రైతు వేదికల నిర్మాణ బాధ్యతలు మండల రైతుబంధు సమితులకు అప్పగించిన సర్కారు... అవగాహన సదస్సులు, చర్చలు నిర్వహించుకునేందుకు వీలుగా అందుబాటులోకి తీసుకురానుంది. రైతుబంధు సమితుల్లో 51 శాతం బలహీన వర్గాలు, మహిళలకు సర్కారు భాగస్వామ్యం కల్పించింది. రాష్ట్ర సమన్వయ సమితిలో గరిష్టంగా 15 మంది రైతు ప్రతినిధులకు అవకాశం కల్పించింది.

క్లస్టర్​కు ఒకటి...

గ్రామీణ ప్రాంతాల్లో క్లస్టర్​లు పరిధిలో రైతులంతా ఒక చోట చేరి సాగు విధానాలపై చర్చించుకోవడానికి వీలుగా రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. క్లస్టర్​కు ఒక వేదిక చొప్పున నిర్మించేందుకు భూసేకరణ పూర్తి చేసింది. కొన్ని ప్రాంతాల్లో కొందరు ఉచితంగా భూమి కూడా అందజేసి తమలోని దాతృత్వాన్ని చాటుకున్నారు.

మూడు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలి...

రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణాలను మూడు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖను ఆదేశించింది. వ్యవసాయ విస్తరణ అధికారుల క్లస్టర్​ల పరిధిలో ఒక్కో రైతు వేదికను కనీసం 2000 చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు. ఒక్కో నిర్మాణానికి 12 లక్షల రూపాయల ఖర్చవుతుందని గతంలో అంచనా వేయగా... ఇప్పుడు అది పెరిగింది. తాజాగా 12 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. రైతు వేదికల కోసం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో 350 కోట్లు కేటాయించింది.

ఈ నిర్మాణాలను మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి అనుసంధానించి అదనంగా అవుతున్న నిధులు 170 కోట్ల రూపాయలు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి : ప్రతిధ్వని: కరోనా విజృంభణ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

Last Updated : Jun 6, 2020, 1:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.