ETV Bharat / state

సాగు 'సాగా'లంటే... రూ.లక్షా 10 వేల కోట్లు అవసరం

author img

By

Published : Mar 20, 2021, 5:10 AM IST

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి రూ. లక్షా 10 వేల కోట్ల మేర అవసరం అవుతాయి. ఇందులో 90 శాతం నిధులను కాళేశ్వరం సహా ఐదు ప్రాజెక్టుల కోసం వినియోగించాల్సి ఉంటుంది. మిగిలిన వాటి కోసం రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది.

సాగు 'సాగా'లంటే... రూ.లక్షా 10 వేల కోట్లు అవసరం
సాగు 'సాగా'లంటే... రూ.లక్షా 10 వేల కోట్లు అవసరం

తెలంగాణలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి మరో రూ. లక్షా పదివేల కోట్లు అవసరమవుతాయి. అందులో 90 శాతానికి పైగా నిధులను 5 ప్రాజెక్టుల్లో ఖర్చు చేయాల్సి ఉంది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల, దేవాదుల, డిండి ఎత్తిపోతల పథకాలకే రూ. 98 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి చేసిన కేటాయింపులను పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి కనీసం మూడు నుంచి నాలుగేళ్లు పట్టనుంది.

మూడింతల నిధులు...

ఐదింటిలో డిండి ఎత్తిపోతల మినహా మిగిలిన వాటికి బ్యాంకులు, కార్పొరేషన్ల నుంచి రుణాలున్నాయి. అయినప్పటికీ భూసేకరణ, ఇతర అవసరాలకు కూడా నిధులు అవసరం. డిండి ఎత్తిపోతల పథకానికి ఇప్పటివరకు చేసిన ఖర్చు పోనూ ఇంకా రూ. 4 వేల100 కోట్లు కావాలి.ఈ పథకానికి ఏదుల లేదా వట్టెం నుంచి నీటిని మళ్లించే పనులకు ఇంకా టెండర్లు పిలవలేదు. బడ్జెట్‌లో రూ. 545 కోట్లు కేటాయించారు. ఈ పథకాన్ని రెండు మూడేళ్లలో పూర్తి చేయాలన్నా ప్రసుత్తం చేసిన కేటాయింపులకు రెండు, మూడింతల నిధులు అవసరం.

మరో రూ. 45 వేల కోట్లు...

కాళేశ్వరం పూర్తి కావడానికి ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం మరో రూ. 45 వేల కోట్లు అవసరం. ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 8 వేల కోట్లు కేటాయించారు. ఇందులో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లింపులకు సుమారు రూ. 3న్నర వేల కోట్లు వెచ్చించాలి. వచ్చే ఏడాది తీసుకునే రుణాలకు 20 శాతం వాటా మార్జిన్‌ మనీ కింద ఖర్చు చేయాలి. దీంతో సంబంధం లేకుండా కేటాయించింది 918 కోట్లు మాత్రమే.

బడ్జెట్ నుంచి...

మల్లన్నసాగర్‌ నుంచి సింగూరు వరకు నీటిని మళ్లించే పనులు, బస్వాపుర, గంథమల రిజర్వాయర్ల నిర్మాణం, శ్రీరామసాగర్‌ నుంచి ఉమ్మడి నిజామాబాద్‌కు నీటిని మళ్లించే పనులకు బ్యాంకు రుణాలు లేవు. ఈ పనులకు కొత్తగా రుణాలు మంజూరయ్యేవరకు రాష్ట్ర బడ్జెట్‌ నుంచే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులో మంజూరై తీసుకోవాల్సిన మొత్తం మరో రూ. 12 వేల కోట్ల వరకు ఉంది.

అత్యధిక ఖర్చు...

అత్యధికంగా ఖర్చు చేయాల్సి ఉన్న మరో ప్రధాన ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి. సవరించిన అంచనా ప్రకారం ఈ పథకం పూర్తికి రూ. 37 వేల 200 కోట్లు అవసరం. బడ్జెట్‌లో కేటాయించింది 960 కోట్లే. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి మంజూరై తీసుకోవాల్సిన రుణం రూ. 3,800 కోట్లు వరకు ఉంది. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టుకు ఎక్కువ మొత్తం నిధులు అవసరమవుతాయి. దేవాదుల, సీతారామ, కంతనపల్లి, వరద కాలువకు రూ. 1,950 కోట్లు కేటాయించారు.

మరిన్ని ప్రాజెక్టులు...

సీతారామ ఎత్తిపోతల పూర్తయ్యేందుకు రూ. 7,550 కోట్లు.. దేవాదులకు రూ. 4,150 కోట్లు అవసరం. ఎత్తిపోతలకు బ్యాంకు రుణాలు మంజూరైనా, లక్ష్యానికి తగ్గట్లుగా పూర్తి కావడానికి మరిన్ని నిధులు అవసరమవుతాయి. భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, ఆధునికీకరణ పనుల్లో ఈ ఐదు పోనూ మరో 34 ఉన్నాయి. ఇందులో కొన్ని పూర్తి కాగా కొన్ని పాక్షికంగా పూర్తయ్యాయి. వీటన్నింటిని పూర్తి చేయడానికి పది శాతం నిధులు అవసరం. ఇందులో కూడా వెయ్యికోట్లకుపైగా అవసరమైన ప్రాజెక్టుల్లో శ్రీశైలం ఎడమగట్టు కాలువ, లోయర్‌ పెన్‌గంగ ఉన్నాయి.

ఇదీ చదవండి: 'ఆ విషయంలో రాష్ట్ర సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.