ETV Bharat / state

రహదారే ప్రసూతి కేంద్రం... అయినా దక్కని ప్రాణం! - విశాఖ ఏజెన్సీ

తొమ్మిది నెలలు మోసింది. బిడ్డను కళ్లరా చూసుకోవాలనుకుంది. కానీ ఆ తల్లికి కడుపుకోతే మిగిలింది. విశాఖ ఏజెన్సీలో రవాణా సౌకర్యం లేక ఓ తల్లి రోడ్డుపైనే ప్రసవించి... పురిటిలోనే బిడ్డను కోల్పోయింది.

రహదారే ప్రసూతి కేంద్రం... అయినా దక్కని ప్రాణం!
author img

By

Published : Sep 14, 2019, 9:58 PM IST

విశాఖ ఏజెన్సీలో గర్భిణులను కష్టాలు వెంటాడుతున్నాయి. శిశు మరణాల రేటును తగ్గించాలని ఓ వైపు ప్రణాళికలు వేసుకుంటున్నా.. ఆ దుస్థితి ఆగట్లేదు. విశాఖ ఏజెన్సీలో... ఎప్పుడూ కన్నీరు పెట్టించే ఇలాంటి కథలే. కంటి ముందు నిర్జీవంగా ఉన్న బిడ్డను చూసి ఏమి చేయాలో తెలియక తనలో తానే కుమిలిపోతున్న గిరిపుత్రులు చాలామందే ఉన్నారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. పాడేరు మండలం వై. సంపల గ్రామానికి చెందిన నిండు గర్భిణి ప్రసవంలోనే బిడ్డను పోగొట్టుకుంది. అడుగుతీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న ఆమెకు రహదారే ప్రసూతి కేంద్రం అయ్యింది. ఆసుపత్రికి తీసుకెళ్తుంటే..ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. కదిలించే వీలు లేక ఆశావర్కర్లు రోడ్డుపైనే ప్రసవం చేశారు. అమ్మ ఒడికి చేరాల్సిన బిడ్డ మృత్యువు ఒడికి చేరింది. ఇంకా కళ్లు తెరవని పసిగుడ్డును బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యయి. ఫలితం తల్లికి కడుపుకోత మిగిలింది.

రహదారే ప్రసూతి కేంద్రం... అయినా దక్కని ప్రాణం!

ఇదీ చదవండి : ఎంపీ రేవంత్​ రెడ్డికి పవన్​ కల్యాణ్​ ఫోన్​

Intro:నాకు బావి చూపండి ....భావి ఎక్కడుందో చెప్పండి ....అంటూ ఓ 70 ఏళ్ల వృద్ధురాలు
గత రెండు రోజులుగా వీధుల్లో కలిసి తిరుగుతూ ఉండగా ....ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. తీరా శనివారం ఉదయం అదే వృద్ధురాలు ఓ బావిలో శవమై కనిపించింది. వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలోని పెద్ద పేట సమీపంలో సుబ్రమణ్య స్వామి ఆలయం వెనుక భాగాన బావిలో ఓ వృద్ధ మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జాడుపూడి గ్రామానికి చెందిన హేమల రత్నాల మ్మ అనే 70 సంవత్సరాల వృద్ధురాలు గా గుర్తించారు. ఈమె రెండు రోజుల క్రితం నుంచి నరసన్నపేట పట్టణంలోని బండి వీధి ,పెద్ద పేట , హనుమాన్ నగర్ వీధుల్లో తిరుగుతూ బావి ఎక్కడ ఉంది అంటూ ఆరా తీస్తూ స్థానికులు అడిగింది . అయితే మతిస్థిమితం లేని మహిళ అంటూ ఎవరూ పట్టించుకోలేదు. శనివారం ఉదయం ఓ మహిళ శవం బావి లో ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. అదే మహిళ రెండు రోజులుగా తిరగడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు jhadupudi లో ఉన్న ఆమె కుమార్తె నాగమణి కి సమాచారం అందించారు. తన తల్లి ఆరోగ్యం సరిగా లేనందున ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నట్టు కుమార్తె నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నరసన్నపేట ఎస్ ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Body:నరసన్నపేటConclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.