హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెహిదీపట్నం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా దూసుకొచ్చిన ఓ స్విఫ్ట్ కారు పిల్లర్ నంబర్ 35 వద్ద ఓ డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
కారులో ప్రయాణిస్తున్న కొల్లూరు గ్రామానికి చెందిన సాయిరోహిత్(22) తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని వెంటనే చికిత్స కోసం దగ్గరలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో లిక్కర్ బాటిల్స్ ఉండటంతో మద్యం మత్తులోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:వలస కష్టం: మండుటెండలో గర్భిణి నడక