హైదరాబాద్ ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అతి వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. వంతెనపై కారు వేగంగా రావడం వల్ల అదుపు తప్పి ప్రమాదం జరిగింది. వాహనంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు.
డివైడర్‌ను ఢీకొన్న వెంటనే ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడం వల్ల ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు డివైడర్ నుంచి కారును పక్కకు తప్పించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'కరోనా వచ్చినా భయపడొద్దు.. ఇలా చేస్తే సరి'