మార్కెటింగ్ శాఖ బకాయిల వసూళ్లు, గోదాముల నిర్వహణ, ఖరీఫ్ కొనుగోళ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హాకా భవన్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి కొనుగోళ్లపై వారానికోసారి సమీక్ష జరపాలని మంత్రి సూచించారు. రావాల్సిన బకాయిలను వెంటనే రాబట్టేలా కార్యాచరణ రూపొందించి త్వరిత గతిన చర్యలు చేపట్టాలన్నారు.
మార్కెట్ ఫీజు ఎగవేతను ఎట్టి పరిస్థితులల్లో ప్రోత్సహించరాదని మంత్రి సూచించారు. ఎవరైనా వ్యాపారి మార్కెట్ ఫీజు ఎగ్గొడితే లైసెన్స్ సస్పెండ్ చేయాలని ఆదేశించారు. సీసీఐ కేంద్రాల వద్ద నిఘా పెట్టి రైతులకు సంపూర్ణ మద్దతు ధర అందేలా చూడాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని కేంద్రాలలో తేమ పరీక్షించే యంత్రాలు అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు.
ఇదీ చూడండి : 'రాయాల్సింది సూసైడ్‌నోట్ కాదు... తెరాసకు మరణ శాసనం'