ETV Bharat / state

ఏపీ అవినీతిలో రెవెన్యూదే అగ్రస్థానం

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి కేసుల్లో అనిశాకు చిక్కుతున్నవారిలో రెవెన్యూ శాఖ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారు. ప్రజల నుంచి లంచాలు తీసుకుంటూ ఈ ఏడాది 62 మంది ప్రభుత్వోద్యోగులు పట్టుబడగా.. వారిలో 28 మంది ఈ శాఖ వారే. వీరిలో వీఆర్‌వోల నుంచి తహసీల్దార్‌ స్థాయి వరకూ ఉన్నారు.

Revenue tops in corruption in Andhra Pradesh
ఏపీ అవినీతిలో రెవెన్యూదే అగ్రస్థానం
author img

By

Published : Dec 31, 2020, 10:22 AM IST

2020లో నమోదుచేసిన కేసులపై అవినీతి నిరోధక శాఖ (అనిశా) వార్షిక నివేదికను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి కేసుల్లో ఏసీబీకి చిక్కుతున్నవారిలో రెవెన్యూ శాఖ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారు. ప్రజల నుంచి లంచాలు తీసుకుంటూ ఈ ఏడాది 62 మంది ప్రభుత్వోద్యోగులు పట్టుబడగా.. వారిలో 28 మంది ఈ శాఖ వారే. ఆకస్మిక తనిఖీలు కూడా అత్యధికంగా రెవెన్యూ శాఖలోనే జరిగాయి. మొత్తం 97 ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా వాటిలో తహసీల్దార్‌ కార్యాలయాల్లో 32, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 18, దేవాదాయ శాఖలో ఒకటి జరిగిందని ఏసీబీ వెల్లడించింది.

పెరిగిన ఆకస్మిక తనిఖీలు

2019తో పోలిస్తే 2020లో ఏసీబీ నమోదు చేసిన మొత్తం కేసుల సంఖ్య పెరిగింది. 2019లో అనిశా మొత్తం 199 కేసులు నమోదు చేయగా.. ఈ ఏడాది 321 నమోదుచేసింది. ఉచ్చు (ట్రాప్‌), అక్రమాస్తుల కేసుల సంఖ్య గతేడాది పోలిస్తే కొంత తగ్గింది. అదే సమయంలో ఆకస్మిక తనిఖీలు, సాధారణ విచారణలు పెరిగాయి.

  • 2019లో 96 ఉచ్చుకేసులు నమోదు కాగా ఈ ఏడాది 62 నమోదయ్యాయి. అక్రమాస్తుల కేసులు గతేడాది 23 నమోదు కాగా ఈ ఏడాది 14 నమోదయ్యాయి.
  • ఆకస్మిక తనిఖీలు 2019లో 40 మాత్రమే జరగ్గా ఈ ఏడాది 97 జరిగాయి.
Revenue tops in corruption in Andhra Pradesh
ఏపీ అవినీతిలో రెవెన్యూదే అగ్రస్థానం

ఇదీ చదవండి: కాగజ్‌నగర్‌ కారిడార్‌లో 2 పులి పిల్లలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.