ETV Bharat / state

'రెవెన్యూ సదస్సులకు హాజరై సమస్యలు పరిష్కరించుకోండి' - తెలంగాణ రెవెన్యూ సదస్సు తాజా వార్తలు

మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కరానికి.. సెప్టెంబర్‌ 15 వరకు జరగనున్న రెవెన్యూ సదస్సులకు హాజరవ్వాలని పురపాలక శాఖ సూచించింది. ప్రతి సోమవారం, బుధవారం ఈ మేళా నిర్వహిస్తారని పేర్కొంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఆయా మున్సిపల్‌ కార్యాలయాల్లో జరిగే రెవిన్యూ సదస్సుకు హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవాలని వెల్లడించింది.

'రెవెన్యూ సదస్సులకు హాజరై సమస్యలు పరిష్కరించుకోండి'

author img

By

Published : Aug 24, 2020, 7:24 AM IST

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజల సౌకర్యార్థం, సమస్యల పరిష్కారానికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పురపాలక శాఖ ఆదేశాలు జారీచేసింది. మున్సిపాలిటీలో ఇల్లు ఉండి మున్సిపల్‌ శాఖ పేర్కొన్న సమస్యలు ఉంటే సెప్టెంబర్ 15వరకు ప్రతి సోమవారం, బుధవారం రోజున మున్సిపల్ కార్యాలయంలో జరుగు రెవెన్యూ సదస్సులో అధికారులు పాల్గొని ప్రజల ఇంటి పన్నుకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తారని తెలిపింది.

ఇల్లు ఉండి ఇంటి పన్నుకు సంబంధించి ఆన్లైన్ నందు ఎంట్రీ కాకుండా ఉన్నవి, ఇంటి పన్ను ఉన్న దానికన్న ఎక్కువగా వచ్చినా, డబుల్ అస్సెస్మెంట్ అయినచో.. ఇంటి పన్ను బకాయి ఉండి కట్టని వారు వన్ టైం సెటిల్ మెంట్ కింద పన్ను వడ్డి పై 90శాతం మాఫీ పొందుట, అన్లైన్ నందు పేరు తప్పుగా పడుట, ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండి పేరు మార్పిడి చేసుకోకపోవడం వంటి సమస్యల పరిష్కరానికి రెవెన్యూ సదస్సులో పాల్గొనవచ్చిని శాఖ సూచించింది.

అలాగే ఇంటి నెంబర్‌ను సెల్ఫ్ అస్సెస్మెంట్ ద్వారా పొందడం, ఇల్లు తీసేసిన తర్వాత కూడా ఇంటి పన్ను వస్తున్నా... తదితర సమస్యలతో పాటు రెవిన్యూ విభాగానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ప్రతి సోమవారం, బుధవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఆయా మున్సిపల్‌ కార్యాలయాల్లో జరిగే రెవిన్యూ సదస్సుకు హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవాలని పురపాలక శాఖ వెల్లడించింది. ఈ అవకాశం సెప్టెంబర్ 15 వరకు మాత్రమే అని స్పష్టం చేసింది.

రెవెన్యూ మేళాకు డోర్ నెంబర్ కోసం అసెస్మెంట్ కాపీ, పేరు మార్పిడి కోసం మ్యుటేషన్ కాపీ /రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఇల్లు తీసేసినట్టయితే ఇంటి పన్ను రద్దు కోసం.. ఫొటో, చివరిగా కట్టిన ఇంటి పన్ను రశీదు, ఇంటి పన్ను ఎక్కువ వచ్చినట్లయితే అస్సెస్మెంట్ కాపీ, ఇంటి ఫొటో లేదా సంబంధిత డాక్యుమెంట్లు, డబుల్ అసెస్మెంట్ అయితే ఇంటి అనుమతి ప్రతి (అనుమతి ఉన్నచో), అస్సెస్మెంట్ నంబర్స్, మొదటగా కట్టిన ఇంటి పన్ను రశీదు వంటివి తీసుకొని రావాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ చివరి అవకాశం సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని మున్సిపల్ శాఖ సూచించింది.

ఇదీ చదవండి: భద్రాద్రి @ 44.6: గోదారి తగ్గుముఖం... నీటిలోనే మన్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.