Revanth Reddy on Palamuru Ranga Reddy Project : కేసీఆర్ పాలనలో పాలమూరు వలసలు ఆగలేదని.. అభివృద్ది జరగలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరుకు ముఖ్యమంత్రి చేసిందేమిటో.. ఆ ప్రాంత బిడ్డల తరపున తాను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు (Palamuru Ranga Reddy Project) పూర్తి కాకుండానే ప్రారంభిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 31 పంపుల్లో కేవలం ఒక్క పంపుతోనే ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారని రేవంత్‌రెడ్డి (Revanth Reddy) దుయ్యబట్టారు.
Revanth Reddy on Palamuru : దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి (Seetha Dayakar Reddy ) తన వందలాది మంది అనుచరులతో.. హైదరాబాద్ గాంధీభవన్‌లో రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీతాదయాకర్‌రెడ్డిని రాజకీయంగా అన్నిరకాలుగా పార్టీ ఆదుకుంటుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. 9 సంవత్సరాల్లో పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. 2 ఎంపీ సీట్లు, 13 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే వలసలు ఆపలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
గతంలో తాను ఎమ్మెల్సీగా గెలిచేందుకు దయాకర్‌రెడ్డి అండగా నిలబడ్డారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. తన రాజకీయ ఎదుగుదల్లో ప్రతీసారి అండగా ఉన్నారని వివరించారు. కాంట్రాక్టులు, కమీషన్లు తప్ప దేవరకద్ర అభివృద్ధి.. ఎమ్మెల్యేకు పట్టడంలేదని ఆరోపించారు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతలను పెండింగ్‌లో పెట్టారని మండిపడ్డారు. పాలమూరు జిల్లాలో 14కు 14 అసెంబ్లీ.. రెండు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని రేవంత్‌రెడ్డి కోరారు.
Tukkuguda Vijaya Bheri Sabha : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు . ఈ నెల 16,17,18 తేదీల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో పాటు ఇతర జాతీయ నాయకులు రాష్ట్రానికి వస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 17న తుక్కుగూడ రాజీవ్‌గాంధీ ప్రాంగణంలో జరిగే విజయభేరి సభకు (Tukkuguda Vijaya Bheri Sabha ) భారీగా ప్రజలు తరలిరావాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
"9 ఏళ్లలో పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఏం చేశారు?. బీఆర్ఎస్ పాలనలో అత్యధికంగా నష్టపోయిన జిల్లా మహబూబ్‌నగర్. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు 30 శాతం కూడా పూర్తి కాలేదు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభిస్తోంది. 2 ఎంపీ సీట్లు, 13 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే వలసలు ఆపలేదు. 9 ఏళ్లలో పాలమూరు జిల్లాలో వలసలు ఆగలేదు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతలను పెండింగ్‌లో పెట్టారు. పాలమూరు జిల్లాలో 14కు 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం." - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈ నెల 17న కాంగ్రెస్ పార్టీ నిర్వహించే విజయభేరి భారీ బహిరంగ సభ ప్రాంగణంలో రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాస్కీ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Congress Party joinings in Telangana : కాంగ్రెస్‌లో ప్రముఖ నాయకుల చేరికకు ముహూర్తం ఖరారు
Revanth Reddy Fire on BJP : 'బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌పై కుట్ర చేస్తున్నాయి'