CWC Meeting Update : గతంలో సిట్టింగ్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోగా.. ఇప్పుడు అందుకు భిన్నంగా సిట్టింగులు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanthreddy) తెలిపారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిర్వహించబోయే సీడబ్ల్యుసీ(CWC Meetings) సమావేశాలకు, జయభేరి బహిరంగ సభకు భద్రత కల్పించాలని రాష్ట్ర డీజీపీ అంజన్‌కుమార్‌ను కోరినట్లు పేర్కొన్నారు.
Revanth Reddy Fire on BJP : 'బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌పై కుట్ర చేస్తున్నాయి'
రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టులు గాంధీభవన్ వచ్చి చర్చలు జరిపారన్న రేవంత్.. ఇప్పుడు తాను పీసీసీ చీఫ్ అయ్యాకే వస్తున్నారన్నారు. ఎన్నికలున్న వేరే రాష్ట్రాల్లో సీడబ్యూసీ సమావేశాలు నిర్వహించకుండా.. తెలంగాణకే అవకాశం ఇచ్చారంటే ఈ రాష్ట్ర కాంగ్రెస్‌కి జాతీయ నాయకత్వం ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. రెండేళ్లుగా కాంగ్రెస్ నిర్వహించినటువంటి సభలు.. అధికార పార్టీ కూడా చేయలేకపోయిందన్నారు.
Revanth on Joining's in Congress : రెండు సంవత్సరాలుగా తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీకి ప్రాధాన్యత పెరుగుతోందన్న రేవంత్‌రెడ్డి.. వ్యక్తులకు ప్రాధాన్యత పెరగలేదని స్పష్టం చేశారు. తాను పీసీసీ చీఫ్ అయ్యాక కొట్లాడి తమ నాయకులకు పదవులు తెస్తున్నట్లు చెప్పారు. అనేక మంది జాతీయ నాయకులు తెలంగాణకు క్యూ కట్టారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2021 జూలై వరకు 156 మంది కీలక నాయకులు కాంగ్రెస్‌ను వీడారన్నారు. 2021 జూలై నుంచి ఇప్పటి వరకు పార్టీ మారిన వాళ్ళు, కాంగ్రెస్‌లోకి వచ్చిన వాళ్ల లెక్క వేస్తె పార్టీకి ఎంత ప్రయోజనం చేకూరిందో తెలుస్తుందన్నారు.
Revanthreddy on CWC Meetings Security : తాజాగా తుక్కుగూడలో జయభేరి సభాస్థలి నిర్వహణ అనుమతికి అధికారులు నిరాకరించారు. దేవాదాయశాఖ భూమిలో రాజకీయ సభలకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. పరేడ్‌గ్రౌండ్‌లో సభ పెట్టుకోవాలని దరఖాస్తు చేసుకుంటే.. దానిని కాంగ్రెస్‌కు ఇవ్వకుండా బీజేపీ(BJP), బీఆర్ఎస్ కుట్ర చేశాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
ఈ సమావేశాలకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతోపాటు.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరుకానున్నందున ప్రాధాన్యం సంతరించుకుంది. సభాస్థలి అనుమతికి అధికారులు నిరాకరించడంతో.. ఉద్దేశపూర్వకంగానే ఆటంకాలు కలిగిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Congress CWC Meetings in Telangana : 17వ తేదీన ఇతరత్ర కార్యక్రమాలు ఏర్పాటు చేయకుండా చూడాలన్నారు. అటు బీజేపీ, ఇటు బీఆర్‌ఎస్‌లు రెండు కూడా విజయభేరి సభకు ఆటంకం కలిగించే ప్రయత్నం సరియైన చర్య కాదని పేర్కొన్నారు. కనీవినీ ఎరుగని విధంగా విజయభేరి సభను నిర్వహించి తీరతామని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి చేరికలు, పొత్తుల అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. రేవంత్ రెడ్డి చెప్పారు.
Revanth Reddy Letter to CM KCR : 'ఒక్క సంతకంతో రెగ్యులర్ చేస్తామన్న హామీ ఏమైంది?'