ETV Bharat / state

రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా దిల్లీలో నూతన తెలంగాణ భవన్​ : సీఎం రేవంత్​ రెడ్డి

Revanth Reddy Visit Telangana CM Official Residence in Delhi : దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్​ రెడ్డి అక్కడ ఉన్న తన అధికార నివాసాన్ని సందర్శించారు. దేశ రాజధానిలోని తుగ్లక్​ రోడ్డు​లో ఉన్న తెలంగాణ సీఎం అధికార నివాసాన్ని పరిశీలించారు. సీఎంగా తొలిసారి రేవంత్​ రెడ్డి దిల్లీలోని తన బంగ్లాకు వెళ్లారు.

Revanth Reddy
Revanth Reddy Visit Telangana CM Official Residence in Delhi
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 19, 2023, 3:06 PM IST

Updated : Dec 19, 2023, 7:51 PM IST

Revanth Reddy Visit Telangana CM Official Residence in Delhi : దిల్లీలోని తుగ్లక్​ రోడ్డులోని అధికారిక నివాసాన్ని తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) సందర్శించారు. అంతకు ముందు ఉన్న కేసీఆర్​ ఆ బంగ్లాను ఖాళీ చేయడంతో నేడు రేవంత్​ రెడ్డి అక్కడకు వెళ్లారు. సీఎంగా ప్రమాణం తర్వాత తొలిసారి తుగ్లక్​ రోడ్​లోని బంగ్లాకు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై సీఎం రేవంత్​ రెడ్డి తెలంగాణ భవన్​ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని దిల్లీలో నూతన తెలంగాణ భవన్​ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy Review Telangana Bhavan : భవన్​ మొత్తం విస్తీర్ణం ఎంత? అందులో ఉన్న భవనాలు, వాటి స్థితి, ప్రస్తుతం ఉన్న భవనాలు, స్థలం వంటి వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్​ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడిగా 19.781 ఎకరాల భూమి ఉందని, అధికారులు సీఎంకు చెప్పినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

ఇందులో ఉమ్మడి భవన్​ పరిధిలోని 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్​, అంతర్గత రోడ్లు, గోదావరి బ్లాక్​, 3.359 ఎకరాల్లో ఓల్డ్​ నర్సింగ్​ హాస్టల్​, 7.641 ఎకరాల్లో పటౌడీ హౌస్​ ఉన్నట్లు అధికారులు సీఎం రేవంత్​ రెడ్డికి వివరించారు. రాష్ట్ర వాటా కింద ఎంత భూమి వస్తుందని సీఎం ప్రశ్నకు, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 58:42 నిష్పత్తి ప్రకారం ఏపీకి 11.536 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాల భూమి తెలంగాణకు వస్తుందని అధికారులు తెలియజేశారు.

Telangana Bhavan in Delhi : మూడు, నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలు కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులు చేయిస్తున్నట్లు రెసిడెంట్​ కమిషనర్​ గౌరవ్​ ఉప్పల్​ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబించేలా నూతన భవనం నిర్మించుకుందామని సీఎం అన్నట్లు భవన్​ అధికారులు ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న ఉమ్మడి భవన్​ మ్యాప్​ను పరిశీలించిన అనంతరం ఆస్తుల విభజనపై అధికారులకు పలు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

పార్లమెంటు మాదిరి అసెంబ్లీ భవనాలు - నిర్మించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం

కేసీఆర్​ పేరుతో ఉన్న నేమ్​ ప్లేట్​ మార్పు : దిల్లీలోని తుగ్లక్​ రోడ్డు(Tughlaq Road) నివాసం వద్ద కేసీఆర్​ పేరుతో ఉన్న నేమ్​ ప్లేట్​ను అధికారులు మార్చారు. ఇప్పటి వరకు కేసీఆర్​ అధికారిక నివాసంగా ఉన్న తుగ్లక్​ రోడ్డులోని 23వ నంబరు బంగ్లా, ఈసారి శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇటీవల బంగ్లా ఖాళీ చేసి కేసీఆర్​ వ్యక్తిగత వస్తువులను వేరే చోటుకు ఆయన సిబ్బంది తరలించారు.

2004 నుంచి 2014 వరకు ఎంపీగా, మంత్రిగా తుగ్లక్​ రోడ్డు నివాసం నుంచే ఆయన కార్యకలాపాలు జరిపేవారు. ఆ తర్వాత 2014 నుంచి 2023 డిసెంబరు తొలి వారం వరకు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్​(KCR) అధికారిక నివాసంగా తుగ్లక్​ రోడ్డు బంగ్లా ఉండేది. ఎన్నికల ఫలితాల అనంతరం బంగ్లా ఖాళీ చేసి తెలంగాణ భవన్​ అధికారులకు కేసీఆర్​ సిబ్బంది బంగ్లాను అప్పజెప్పారు. సుమారు 20 ఏళ్ల పాటు కేసీఆర్​ అధికారిక నివాసంగా తుగ్లక్​ రోడ్డు బంగ్లా ఉంది.

CM Revanth Reddy Delhi Tour : సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేడు తొలిసారి రేవంత్​ రెడ్డి సందర్శించారు. ప్రస్తుతం రేవంత్​ నివాసంగా ఉన్న ఎంఎస్​ ఫ్లాట్స్​ యమున అపార్టుమెంటులో 902 ఫ్లాట్​ను త్వరలో ఖాళీ చేయనున్నట్లు సమాచారం. తుగ్లక్​ బంగ్లాలో మార్పులు చేర్పులు చేసిన తర్వాత పూజలు చేసి అధికారికంగా బంగ్లాను సీఎం రేవంత్​ రెడ్డి వినియోగించుకోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఔటర్​కు బయట, రీజినల్ రింగ్‌రోడ్‌కు లోపల భూములు సేకరించండి : రేవంత్​రెడ్డి

ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష - కేంద్రం నిధులు ఏం చేశారని నిలదీత

Last Updated : Dec 19, 2023, 7:51 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.