ETV Bharat / state

Revanth Reddy reaction on Rahul Gandhi : 'రాహుల్‌గాంధీ ఎంపీ సభ్యత్వం పునరుద్ధరణ ప్రజాస్వామ్య విజయం' - Rahul Gandhi in defamation case

Revanth Reddy reaction on Rahul Gandhi : రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించడం ప్రజాస్వామ్య విజయంగా రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అభివర్ణించారు. బీజేపీ పాలకుల నిరంకుశ వైఖరికి ఇది చెంప పెట్టు లాంటిదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. రాహుల్​ను తిరిగి పార్లమెంట్‌కు సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Rahul Gandhi MP Membership Renewal Revanth Reddy
Rahul Gandhi On Telangana Congress
author img

By

Published : Aug 7, 2023, 3:28 PM IST

Rahul Gandhi MP Membership Renewal Revanth Reddy comments : పరువు నష్టం కేసులో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరిస్తూ... తిరిగి ఆయన లోక్​సభ సభ్యత్వం పునరుద్ధరించడంపై రాష్ట్ర కాంగ్రెస్​ నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాహుల్​ లోక్​సభ సభ్యత్వం పునరుద్ధరించడం ప్రజాస్వామ్య విజయంగా నేతలు అభివర్ణించారు. ఎప్పటికైనా న్యాయం గెలిచి తీరుతుందన్న విశ్వాసం తమలో ఉన్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. బీజేపీ పాలకుల నిరంకుశ వైఖరికి ఇది చెంప పెట్టు లాంటిదని ఆయన​ పేర్కొన్నారు.

Rahul Gandhi Defamation Case on Supreme Court : రాహుల్ గాంధీ తిరిగి పార్లమెంట్‌కు సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు రేవంత్​ పేర్కొన్నారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడంతో.. లోకసభ సెక్రటేరియట్‌ ఆయన సస్పెన్షన్‌ను ఎత్తి వేసి ఆయన సభ్యత్వాన్ని తిరిగి పునరుద్దరించడం శుభపరిణామమని కాంగ్రెస్​ నేతలు.. మల్లు రవి, జి.నిరంజన్‌, వి.హనుమంతురావు, పొన్నాల లక్ష్మయ్య, మహేష్‌కుమార్‌ గౌడ్‌, మధుయాస్కీ గౌడ్, కోదండ రెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

"రాహుల్‌గాంధీ ఎంపీ సభ్యత్వం పునరుద్ధరణ ప్రజాస్వామ్య విజయం. ఎప్పటికైనా న్యాయం గెలిచి తీరుతుంది. బీజేపీ నిరంకుశ వైఖరికి ఇది చెంపపెట్టు."- రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

4 నెలల తర్వాత లోక్​సభకు రాహుల్​.. స్వాగతం పలికిన 'ఇండియా' కూటమి నేతలు

దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ సంబురాలు: సుప్రీం కోర్టు తీర్పుతో రాహుల్​గాంధీ ఎంపీ సభ్యత్వం లోక్​సభ సచివాలయం తిరిగి పునరుద్ధరించింది. దీంతో ఆయన నాలుగు నెలల అనంతరం తిరిగి పార్లమెంట్​లో అడుగు పెట్టారు. మొదట పార్లమెంట్‌ భవనం వద్ద గాంధీ విగ్రహానికి రాహుల్‌ నివాళులు అర్పించారు. అనంతరం హాల్​లోకి రాగా.. విపక్ష ఎంపీలు సాదరంగా ఆహ్వానించారు. రాహుల్​ గాంధీ లోక్​సభ సభ్యత్వం తిరిగి పునరుద్ధరించడంతో హస్తం నేతల దేశవ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. దిల్లీలోని 10 జన్‌పథ్‌ వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు బాణసంచా కాల్చుతూ మిఠాయిలు పంచుకున్నారు. రాహుల్‌పై అనర్హత ఎత్తివేతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వాగతించారు.

Telangana Congress : కాంగ్రెస్​లో తాత్కాలికంగా ఆగిన చేరికలు.. ఆ తర్వాతనే మళ్లీ జోరు

రాహుల్​ కేసు నేపథ్యం: 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మోదీ ఇంటిపేరుపై రాహుల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. ఆయనపై పరువు నష్టం కింద గుజరాత్‌లో కేసు నమోదైంది. దీంతో ఈ ఏడాది మార్చి 23న సూరత్​ కోర్టు రాహుల్​కు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. తీర్పు వెలువడిన 24 గంటల్లోపే రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేసింది. దీనిపై గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించగా.. తీర్పుపై స్టే విధించాలన్న పిటిషన్‌ను కొట్టేసింది. అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో రాహుల్‌గాంధీకి భారీ ఊరట లభించింది.

Revanth Reddy Vs KTR : రాహుల్​పై కేటీఆర్ 'ఎడ్లు-వడ్లు' వ్యాఖ్యలు.. ప్రాస కోసం పాకులాడే వారికేం తెలుసంటూ కాంగ్రెస్​ కౌంటర్

'అప్పుడు 24 గంటల్లోనే రాహుల్​పై అనర్హత.. ఇప్పుడు సభ్యత్వం పునరుద్ధరణకు ఎంత సమయం?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.