ETV Bharat / state

పట్నం గోసలో రేవంత్​ రెడ్డితో వాగ్వాదం

పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వైఫల్యాలను ఎండగట్టేందుకు రేవంత్ రెడ్డి చేపట్టిన పట్నం గోస కార్యక్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్​లోని రసూల్​పుర, మడ్​ఫోర్డ్, మారేడుపల్లిలోని రెండు పడక గదుల ఇళ్లను పరిశీలించారు. ఓ వ్యక్తి వచ్చి రేవంత్​తో వాగ్వాదానికి దిగాడు.

patnam gosa
పట్నం గోస
author img

By

Published : Feb 29, 2020, 2:54 PM IST

మల్కాగిజిరి ఎంపీ రేవంత్​ రెడ్డి పట్నం గోస కార్యక్రమంలో చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. మారేడిపల్లి వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన ఆయన స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్లను స్థానికంగా ఉన్న వారికే కేటాయించాలని అక్కడి పేద ప్రజలు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఇళ్లకి సంబంధించిన దస్తావేజులు చూపిస్తూ డబుల్ బెడ్ ​రూమ్ ఇళ్లు తుది దశకు చేరుకున్నప్పటికీ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్క ఇల్లు కూడా నిర్మించడం లేదని అనడం ఎంతవరకు సమంజసమని రేవంత్​ని ప్రశ్నించారు.

దీటైన జవాబు

ఈ ఆరోపణలతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. అతని మాటలకు రేవంత్ రెడ్డి బదులిచ్చారు. తనను ప్రశ్నించిన వ్యక్తి బాధ్యత తీసుకొని కాంట్రాక్టర్లకు డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. సంవత్సరంలో పూర్తి చేసి ఇస్తామన్న ఇళ్లు మూడైళ్లైనా ఇవ్వలేదన్నారు. త్వరలోనే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామన్నారు.

పట్నం గోస

ఇదీ చదవండి: ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.