ETV Bharat / state

కాళేశ్వరం వ్యవహారంలో బీజేపీకి బీఆర్ఎస్ ప్రొటెక్షన్ మనీ ఇస్తోంది : రేవంత్ రెడ్డి

Revanth Reddy on Kaleshwaram Project : తెలంగాణలో పెను దుమారం రేపిన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ లోపాన్ని.. రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై నెట్టే ప్రయత్నం చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్ట్​ విషయంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో బీజేపీకి బీఆర్ఎస్ ప్రొటెక్షన్ మనీ ఇస్తోందని ఆరోపించారు.

Revanth Reddy Fires on CM KCR
Revanth Reddy on Kaleshwaram Project
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2023, 2:17 PM IST

Updated : Nov 4, 2023, 2:35 PM IST

కాళేశ్వరం వ్యవహారంలో బీజేపీకి బీఆర్ఎస్ ప్రొటెక్షన్ మనీ ఇస్తోంది

Revanth Reddy on Kaleshwaram Project : మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో ఆ తప్పును సీఎం కేసీఆర్​ అధికారులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. డిజైన్​కు అనుగుణంగా మేడిగడ్డ నిర్మాణం జరగలేదని తెలిపారు. కాళేశ్వరం నిర్మాణానికి కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరేనన్న రేవంత్.. ఆయన ధనదాహానికి నిదర్శనం మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు అని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్​ విషయంలో తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు.

Revanth Reddy Fires on CM KCR : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న కాళేశ్వరం వివాదంపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు.. 2014 నుంచి 2018 వరకు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీశ్​రావు ఉన్నారని గుర్తు చేశారు. 2018 నుంచి ఇవాళ్టి వరకు కేసీఆర్​ సాగునీటి శాఖ బాధ్యతను చూస్తున్నారని చెప్పారు. 8 ఏళ్ల క్రితం విశ్రాంత అధికారికి ఈఎన్సీ బాధ్యతలు ఇచ్చారని.. అనంతరం తప్పుడు అంచనాలు వేయించారని ఆరోపించారు.

'కాళేశ్వరంలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూశా, ప్రాజెక్టు పేరుతో బీఆర్​ఎస్​ లక్ష కోట్ల దోపిడీకి పాల్పడింది'

మేడిగడ్డ కుంగిపోవడం అంటే బ్యారేజీ మొత్తం కుంగిపోతుందని నేషనల్​ డ్యామ్ సేఫ్టీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ 20 అంశాలకు సంబంధించిన వివరాలు అడిగితే.. 9 అంశాలపై నివేదిక ఇవ్వలేదని రేవంత్ అన్నారు. నిర్మాణంలో నాసిరకంతో పాటు అవినీతి జరిగిందని ప్రభుత్వానికి తెలుసని.. అందుకే ఆధారాలు తొక్కి పెడుతున్నారని ఆరోపించారు. ఈ బ్యారేజీని కూల్చి కొత్తగా నిర్మించాలని డిమాండ్ చేశారు.

"మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై వస్తున్న వార్తలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పై ఉంది. ఎల్‌అండ్‌టీ సంస్థపై క్రిమినల్‌ కేసులు పెట్టి చర్యలు తీసుకునేందుకు కేసీఆర్‌ ఎందుకు ముందుకు రావడం లేదు. క్రిమినల్‌ కేసులు పెట్టడానికి కేసీఆర్‌ మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిర్మాణ సంస్థ వైఫల్యం వల్లే మేడిగడ్డ కుంగిందని సీఎం ఎందుకు చెప్పడం లేదు." - రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

"చిన్న విషయానికే ట్విటర్​లో స్పందించే కేసీఆర్​ కుటుంబం.. మేడిగడ్డ విషయంలో ఎందుకు స్పందించదు?"

Revanth Reddy on Medigadda Project Damage : నిర్మాణ, నిర్వహణ, డిజైన్‌, ప్లానింగ్‌ లోపం వల్ల రాష్ట్రానికి రూ.వేల కోట్ల నష్టం జరిగిందని రేవంత్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ ద్వారా నివేదిక తెప్పించాలని కోరారు. ఆ నివేదిక ద్వారా సీబీఐతో విచారణ చేయించాలని.. ఈ ప్రాజెక్టులో అవకతవకలకు పాల్పడ్డవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Medigadda Project Damage Issue in Telangana : కేంద్ర ప్రభుత్వం అర్ధాంతరంగా ఒక నివేదిక ఇచ్చి వదిలేసిందని రేవంత్​ మండిపడ్డారు. మేడిగడ్డ వ్యవహారంపై కేంద్రం తరఫున ఎవరూ మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు కేంద్రం ఎందుకు వెనుకడుగు వేస్తోందని నిలదీశారు. రాష్ట్రంలో జరిగిన అవినీతి నుంచి బీజేపీ.. బీఆర్ఎస్​కు ప్రొటెక్షన్​ మనీ ఇస్తోందని.. అందుకే కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను బలి తీసుకునేది కాళేశ్వరం ప్రాజెక్టే : రేవంత్ రెడ్డి

ప్రపంచంలో అతిపెద్ద అవినీతి ప్రాజెక్టుగా కాళేశ్వరం నిలిచిపోనుంది : బీజేపీ నేతలు

Last Updated : Nov 4, 2023, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.