Revanth Reddy: కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షల బీమా సదుపాయం కల్పిస్తూ పీసీసీ నిర్ణయం తీసుకుంది. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి 2 లక్షల బీమా కల్పిస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 30లక్షల డిజిటల్ సభ్యత్వాలు లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 7 లక్షలు సభ్యత్వాలు పూర్తయ్యాయన్న ఆయన.. నిర్దేశించుకున్న లక్ష్యం ఈ నెల 26నాటికి పూర్తికాకుంటే మరికొన్నిరోజులు గడువు కావాలని అధిష్ఠానాన్నికోరనున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో చేరేవారికి ఒక ధీమా కల్పిస్తున్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల బీమా సదుపాయం లభిస్తుందన్నారు. చాలా పారదర్శకంగా కాంగ్రెస్ సభ్యత్వ నమోదును నిర్వహిస్తున్నామన్నారు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రజలు చాలా గర్వంగా మేం కాంగ్రెస్ సభ‌్యులం అని చెప్పుకునేలా చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. సభ్యులకు బీమా కల్పించడం ఇదే మొదటిసారన్న ఆయన.. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ సభ్యత్వం ఉంటుందని స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ గత నెల 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభమైందన్నారు.
రాష్ట్రంలోని 34,765 పోలింగ్ బూతుల నుంచి ఒక్కో ఎన్‌రోలర్‌ను పార్టీ అమలు చేస్తోందని వివరించారు. ప్రతి బూతులో వంద మంది సభ్యులు సభ్యత్వం ఉండేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో వేణుగోపాల్, దీపక్ జాన్‌లు కో ఆర్డినెట్ చేస్తున్నారని పేర్కొన్నారు.
ఆర్థిక భద్రత కల్పించేందుకే..
'కాంగ్రెస్ పార్టీలో చేరేవారికి ఒక ధీమా కల్పిస్తున్నాం. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల బీమా సదుపాయం ఇస్తున్నాం. చాలా పారదర్శకంగా కాంగ్రెస్ సభ్యత్వ నమోదును నిర్వహిస్తున్నాం. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డు ఇస్తున్నాం. ప్రజలు చాలా గర్వంగా మేం కాంగ్రెస్ సభ‌్యులం అని చెప్పుకునేలా చేస్తాం. చనిపోయిన కార్యకర్త కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకే బీమా సౌకర్యం. 30 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నాం.
-రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇదీ చదవండి: