ETV Bharat / entertainment

నయా జానర్​లో శోభిత అప్​కమింగ్ మూవీ - పెళ్లి తర్వాత షూటింగ్ స్టార్ట్! - SOBHITA DHULIPALA UPCOMING MOVIE

ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్​లో శోభిత - డైరెక్టర్ ఎవరంటే?

Sobhita Dhulipala Upcoming Movie
Sobhita Dhulipala (ETV Bhart)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 1:11 PM IST

Sobhita Dhulipala Upcoming Movie : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. రీసెంట్​గా ఆమె 'లవ్ సితారా' అనే వెబ్ ఫిల్మ్​తో అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే త్వరలో ఆమె ఓ కొత్త జానర్​లో నటించేందుకు సిద్ధమవుతున్నారట. ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్​లో శోభిత కీ రోల్​ ప్లే చేయనున్నారట. ఇందులో యంగ్ హీరో '35 చిన్న కథ కాదు' ఫేమ్​ విశ్వదేవ్ రాచకొండ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా చంద్ర అనే డైరెక్టర్​ ఇండస్ట్రీకి పరిచయవ్వనున్నారట.

ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి సురేశ్​ ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ చిత్రీకరణ కూడా జరిగిందట. ఇక నాగ చైతన్య- శోభిత వివాహం తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాల మాట. మూవీకి సంబంధించిన మిగతా అప్డేట్స్ కూడా త్వరలోనే రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

వివాహం అక్కడే!
అయితే నాగ చైతన్య- శోభిత వివాహాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్‌గానే ప్లాన్ చేయగా, ఇప్పుడు ఆ వేదికను హైదరాబాద్​కు షిప్ట్ చేసినట్లు తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్​లో ఈ జంట వివాహం జరగనుందట. ఈ వేడుక కోసం ఓ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్‌ అక్కడ ప్రత్యేకమైన సెట్ వేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వేదికను ప్రత్యేకంగా అలంకరించే పనులు కూడా చాలా ఫాస్ట్​గా జరుగుతున్నాయట. ఇక అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరుగుతుందని సమాచారం. కొద్ది రోజుల కిందటే వీరి పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట తెగ ట్రెండ్ అయ్యాయి.

కాగా శోభిత 'గూఢచారి', 'మేడ్ ఇన్ హెవెన్', 'ఘోస్ట్ స్టోరీస్', 'నైట్ మేనేజర్', 'పోన్నియన్ సెల్వన్' వంటి సినిమా/సిరీస్​లో కీ రోల్స్​లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్​ ఇండస్ట్రీలే కాకుండా తాజాగా హాలీవుడ్​లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.

'సమంత నా సోల్​మేట్- అలా చూసేసరికి కళ్లలో నీళ్లు తిరిగాయి' - Sobhita Dhulipala

నా పిల్లలకు వాళ్ల గురించి చెబుతాను : శోభిత ధూళిపాళ్ల - SobhitaDhulipala About Her Children

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.