Revanth Reddy on KCR Election Contest : సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సవాల్‌ను స్వీకరించకుండా ఓటమిని ఒప్పుకున్నారని టీపీసీసీ (TPCC) అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా చూసిన తర్వాత రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని అర్థమైందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2/3 మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారంటే అయనే స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నట్లేనని.. రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఓడిస్తారని జోస్యం చేశారు.
Revanth Reddy Fires on KCR : గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్.. కేసీఆర్ పారిపోవాలనుకుంటే సిద్దిపేట (Siddipet), సిరిసిల్ల (Siricilla) ఉందని.. కానీ ఒక మైనార్టీ నేత ఉన్న కామారెడ్డికి వెళ్లడం మైనార్టీలను అవమానించడమేనన్నారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో లెక్కలతో సహా చర్చకు సిద్దమన్నారు. రూ.23లక్షల కోట్లతో తెలంగాణలో చేసిన అభివృద్ది ఏంటో చర్చకు రావాలని రేవంత్ సవాల్ విసిరారు. నమ్మించి మోసం చేసిన కేసీఆర్‌పై కమ్యూనిస్టులు పోరాటం చేయాలన్నారు.
"గజ్వేల్‌లో గెలుపుపై నమ్మకం లేకనే కేసీఆర్ కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు. షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రజలకు ఎంతగానో సేవలందించారు. కేసీఆర్ స్వరంలో ఓటమి భయం స్పష్టంగా కనిపించింది. బీఆర్ఎస్ జాబితా చూశాక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం అని తేలిపోయింది. వచ్చే ఎన్నికల్లో మూడింట రెండొంతులు స్థానాలు గెలుస్తాం. నేను విసిరిన సవాల్‌ను కేసీఆర్ స్వీకరించలేదు. కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తానన్నపుడే ఆయనకు ఓటమి భయం వచ్చింది. నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు ఎవ్వరు కట్టారు? 12,500 గ్రామ పంచాయతీలకు కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్. ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో నిర్మించింది కాంగ్రెస్.' - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
Revanth Reddy Fires on KTR : బీఆర్ఎస్ అభ్యర్థుల మొదటి లిస్టు ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం 12.30గంటలకు విడుదల కావాలని.. ఆ సమయంలో లిక్కర్ షాప్స్ డ్రా (Liquor Shops Draw) తీయడంతో ఆగిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రాధాన్యత ఏంటో తెలంగాణ సమాజం అర్ధం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. రూ. లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్... రూ.99,999 వరకే మాఫీ చేసి లక్కీ నంబర్ చూపారని విమర్శించారు. ఐఆర్బీ నుంచి వచ్చిన సొమ్ముతో పెట్టుబడి పెట్టేందుకు కేటీఆర్ అమెరికా వెళ్లారని రేవంత్ ఆరోపించారు. మందు, డబ్బులు పంచకుండా ప్రజలను ఓట్లు అడిగేందుకు కేసీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. సూర్యాపేట సభ సాక్షిగా శ్రీకాంత చారి తల్లిని నిలబెట్టి అవమానించారని ఆరోపించారు.
BRS MLAs Final Candidates List 2023 : బీఆర్ఎస్ గెలుపు గుర్రాలివే.. తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్!