ETV Bharat / state

Revanth fires on trs: 'ప్రజాస్వామ్యం ఖూనీ అయింది.. ఇది కల్వకుంట్ల రాజ్యాంగమా?' - Local body mlc elections 2021

స్థానికసంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth fires on trs) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలి నామినేషన్‌ పత్రాలు చింపేశారని మండిపడ్డారు. తెరాస శ్రేణులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని.. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందా..? అని ట్విట్టర్​ వేదికగా రేవంత్​ ప్రశ్నించారు.

revanth reddy, local body elections
రేవంత్​ రెడ్డి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు
author img

By

Published : Nov 24, 2021, 1:41 PM IST

Revanth fires on trs: రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలి నామినేషన్‌ పత్రాలను తెరాస శ్రేణులు చించివేయడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. నిన్న జరిగిన ఘటనలపై ట్విటర్​​ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరం నడిబొడ్డున ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ట్వీట్‌ చేశారు. పోలీసుల సమక్షంలో ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలి నామినేషన్‌ పత్రాలు చించివేత జరుగుతున్నా పోలీసులు అడ్డుకోలేక పోయారని ఆరోపించారు.

రాజ్యాంగం అమలవుతోందా...? లేక కల్వకుంట్ల రాజ్యాంగం(Local body mlc elections 2021) ఏమైనా అమలు జరుగుతోందా..? అని రేవంత్‌రెడ్డి ట్విటర్‌లో ప్రశ్నించారు. పోలీసులు.. ముఖ్యమంత్రికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. డీజీపీ, సీఎంవో, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారికి ట్వీట్‌ను రేవంత్‌రెడ్డి ట్యాగ్‌ చేశారు.

  • నగరం నడిబొడ్డున ప్రజాస్వామ్యం ఖూనీ అయింది
    రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలి నామినేషన్ పత్రాలను టీఆర్ఎస్ గూండాలు చించేస్తుంటే చూస్తూ ఉన్న పోలీసులు రక్షకభటులా? కేసీఆర్ కు బానిసలా?
    ఇక్కడ అమలయ్యేది భారత రాజ్యాంగమా?కల్వకుంట్ల రాజ్యాంగమా! @TelanganaCMO @TelanganaDGP @CEO_Telangana pic.twitter.com/3Wp6JdSZYE

    — Revanth Reddy (@revanth_anumula) November 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

High Tension at rangareddy collectorate: 'పోలీసులను అడ్డంపెట్టుకొని తెరాస గెలవాలని ప్రయత్నిస్తోంది'

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా నిన్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​ ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నామినేషన్ల గడువు చివరి నిమిషం వరకు ఇదే ఉద్రిక్తత కొనసాగింది. తెరాస అభ్యర్థులు శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి(trs candidates nominations for Local body mlc elections) మంగళవారం నామ పత్రాలు సమర్పించారు. వారికి మద్దతుగా తెరాస శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో నామినేషన్ వేసేందుకు వచ్చిన స్వతంత్ర అభ్యర్థులను తెరాస నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చింపివేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా... పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

మహిళ అని కూడా చూడకుండా

పోలీసులను అడ్డంపెట్టుకొని గెలవాలని తెరాస ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు చింపుల శైలజ సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు. తమ ఎంపీటీసీల సమస్యల పరిష్కారం కోసం పోటీలో నిలబడితే నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని అన్నారు. మహిళ అని కూడా చూడకుండా తనపై దాడి చేసి... నామినేషన్ పత్రాలను చింపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఆందోళన చేపట్టారు. పోలీసులు తమను కలెక్టరేట్​లోనికి అనుమతించకపోవడంతో వందలాది మంది కలెక్టరేట్​ ముందు బైఠాయించారు.

ఇదీ చదవండి: REVANTH REDDY: 'కేసీఆర్‌ యాత్రలతో రాష్ట్రానికి, రైతులకు ఒరిగేదేమీ లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.