Revanth Reddy fire on CV Anand: హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా తామే పోస్టులు పెట్టారని ఎలా చెబుతారని అసహనం వ్యక్తం చేశారు. 'సీవీ ఆనంద్ ఐపీఎస్ అధికారి లేక ఓ పార్టీ కార్యకర్త' అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. సొంత పార్టీ నేతలపై ఎవరైనా వ్యతిరేక పోస్టులు పెడతారా అని మండిపడ్డారు.
తీన్మార్ మల్లన్న ఎవరో తెలియదని.. ఆయన ఎవరినో తిడితే తనకేం సంబంధమని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఎవరో పెడుతున్న పోస్టులు తనకు ఆపాదించవద్దని ఆయన కోరారు. 'పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకునే వ్యక్తి నేను'.. అలాంటింది సొంత పార్టీ నేతలపై ఎందుకు వ్యతిరేక పోస్టులు పెడతానని ప్రశ్నించారు. కావాలనే తనపై కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంచి వారిపై పూలే కాదు అప్పుడప్పుడు రాళ్లు కూడా పడతాయని వాటిని ఎదుర్కొని ముందుకు పోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. తనపై ఉన్న అపోహలు తొలగించుకొని నమ్మకంతో కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని కోరారు. సునీల్ కనుగోలు టీం సభ్యుల అరెస్ట్‌కు సంబంధించి రేవంత్ స్పందించారు. వార్‌రూమ్‌కు వెళ్లి వారిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు.
"పార్టీ వార్‌రూమ్‌పై దాడి చేసి సమాచారాన్ని పోలీసులు దొంగిలించారు. పోలీసులు కేసీఆర్ ప్రైవేటు సైన్యంలా వ్యవహరించారు. తప్పుడు సమాచారం ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతున్నారు. కేసీఆర్ మెప్పు పొంది డీజీపీ పోస్టు తెచ్చుకోవాలనుకుంటున్నారు. పార్టీలో జరిగే పరిణామాలపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. అన్ని సమస్యలకు అధిష్ఠానం పరిష్కారం చూపుతుంది."- రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: