Revanth Reddy Tweet: వరంగల్ ఎంజీఎం ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీయూలోకి ఎలుకలు దూరడమేంటని మండిపడుతున్నారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన రీతిలో ఆరోగ్య శాఖపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఆరోగ్య శాఖ మంత్రి తీరును విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
'కేసీఆర్ కిట్' లో మంత్రి హరీశ్‌రావుతో పాటు కుక్కలు, పిల్లులు, ఎలుకలు, బొద్దింకలు, నల్లులు, దోమలు చేరి పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కిట్ పేరుతో గొప్పలు చెప్పుకోవడం ఆపి.. ఆస్పత్రుల్లో ఎలుకలు, బొద్దింకలు, నల్లులు, దోమలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులు కల్పించాలని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆస్పత్రులపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
-
ఆరోగ్య మంత్రి హరీష్ గారూ…
— Revanth Reddy (@revanth_anumula) April 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
“కేసీఆర్ కిట్టీ”లో మీతో పాటు కుక్కలు, పిల్లులు,ఎలుకలు,బొద్దింకలు,నల్లులు, దోమలు చేరి పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
“కేసీఆర్ కిట్”అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఆపి,ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు కల్పించండి
పేదల పట్ల మానవత్వం ప్రదర్శించండి pic.twitter.com/QEhUFZkEo0
">ఆరోగ్య మంత్రి హరీష్ గారూ…
— Revanth Reddy (@revanth_anumula) April 1, 2022
“కేసీఆర్ కిట్టీ”లో మీతో పాటు కుక్కలు, పిల్లులు,ఎలుకలు,బొద్దింకలు,నల్లులు, దోమలు చేరి పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
“కేసీఆర్ కిట్”అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఆపి,ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు కల్పించండి
పేదల పట్ల మానవత్వం ప్రదర్శించండి pic.twitter.com/QEhUFZkEo0ఆరోగ్య మంత్రి హరీష్ గారూ…
— Revanth Reddy (@revanth_anumula) April 1, 2022
“కేసీఆర్ కిట్టీ”లో మీతో పాటు కుక్కలు, పిల్లులు,ఎలుకలు,బొద్దింకలు,నల్లులు, దోమలు చేరి పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
“కేసీఆర్ కిట్”అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఆపి,ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు కల్పించండి
పేదల పట్ల మానవత్వం ప్రదర్శించండి pic.twitter.com/QEhUFZkEo0
అసలేం జరిగిందంటే.. ఎంతో మంది రోగులకు వరప్రదాయినిగా మారిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి... మరికొందరు రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పెద్దాసుపత్రికి వచ్చిన రోగులకు ప్రాణాల మీద ఆశలు లేకుండా చేస్తోంది. ఇటీవల కాలంలో ఎలుకల కారణంగా కొందరు రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అసలే కిడ్నీ, లివర్ సమస్యలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శ్రీనివాస్ మీద ఎలుకలు రెండ్రోజుల వ్యవధిలో రెండుసార్లు దాడి చేసి కాళ్లు, చేతుల వేళ్లు కొరికాయి. దీంతో ప్రాణాలు నిలుపుకుందామని ఇక్కడికొస్తే ఇదేం పరిస్థితి అంటూ శ్రీనివాస్ బంధువులు వాపోతున్నారు.
ఇదీ చదవండి: MGM Hospital: దండిగా ఎలుకలు.. రోగుల్లో గుబులు