ETV Bharat / state

Revanth Reddy challenged BRS : 'ఇందిరమ్మ ఇళ్లు ఉన్న చోట బీఆర్​ఎస్​ ఓట్లు అడగకూడదు..' - చేవెళ్లలో ప్రజాగర్జన సభ

Revanth Reddy challenged BRS : ఈనెల 26న చేవెళ్లలో కాంగ్రెస్​ పార్టీ ప్రజాగర్జన సభ ఉంది.. ఆసభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరుకానున్నారని రేవంత్​ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న చోట బీఆర్​ఎస్​ ఓట్లు అడగకూడదు.. డబుల్​ బెడ్​రూం ఇళ్లు ఉన్న చోట కాంగ్రెస్ ఓట్లు అడగదని ఈ సవాల్​కు బీఆర్​ఎస్ సిద్ధమేనానని అన్నారు. బీజేపీ సీనియర్​ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్​ను పార్టీ కండువా కప్పి రేవంత్ పార్టీలోకి ఆహ్వానించారు.

Revanth Reddy Comments On BRS
Revanth Reddy challenged BRS
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2023, 7:34 PM IST

Revanth Reddy challenged BRS : ఇందిరమ్మ ఇళ్లు ఉన్న చోట బీఆర్​ఎస్​ ఓట్లు అడగకూడదు.. డబుల్​ బెడ్​రూం ఇళ్లు ఉన్న చోట కాంగ్రెస్(Congress)​ ఓట్లు అడగదని ఈ సవాల్​కు బీఆర్​ఎస్(BRS)​ సిద్ధమేనా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి(Revanth Reddy) అన్నారు. ఈ సవాల్​ను స్వీకరిస్తే బీఆర్​ఎస్​ పార్టీకి డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో కాంగ్రెస్​లో చేరిన బీజేపీ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్​ను రేవంత్​ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్​రావు ఠాక్రే, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​, బీజేపీలపై విమర్శలు చేశారు.

"కృష్ణా, గోదావరి జలాలను హైదరాబాద్​కు కాంగ్రెస్​ పార్టీనే తీసుకువచ్చింది. హైటెక్​ సిటీని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్​కే. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు అవినీతిని పాల్పడ్డారు. ఇంకా సిరిసిల్ల, నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇస్తేనే కామారెడ్డిలో ఓట్లు అడగాలని" టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి అన్నారు.

Congress Chevella Praja Garjana Sabha : ఈ నెల 26న చేవెళ్ల ప్రజాగర్జన సభ.. SC, ST డిక్లరేషన్​ విడుదల చేయనున్న ఖర్గే

Revanth Reddy Comments On BRS : బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో రెండు లక్షల డబుల్​ బెడ్​రూం ఇళ్లు కూడా కట్టలేదని రేవంత్​ రెడ్డి ధ్వజమెత్తారు. అదే కాంగ్రెస్​ హయాంలో అయితే గ్రామగ్రామాన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో ఇందిరమ్మ ఇళ్లు ఉన్న చోట కాంగ్రెస్​ ఓట్లు అడుగుతుందని.. రెండు పడక గదులు ఉన్న చోట బీఆర్​ఎస్​ ఓట్లు అడగాలని సవాల్​ విసిరారు. ఈ సవాల్​కు బీఆర్​ఎస్​, కేసీఆర్​ సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఇలా సవాల్​ స్వీకరిస్తే.. ఈసారి ఆ పార్టీకి డిపాజిట్లు కూడా వస్తాయో చూద్దామన్నారు.

Congress MLA Ticket Applications : కాంగ్రెస్‌ రేసుగుర్రాల ఎంపిక.. తొలిరోజు 18 దరఖాస్తులు

"పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. అవినీతి జరిగిందని నిరూపించడానికి కాంగ్రెస్​ సిద్ధం. కాంగ్రెస్​ హాయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించాం. మరి మీ హాయాంలో ఎన్ని ఇళ్లు కట్టించారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న చోటకు బీఆర్​ఎస్​ వెళ్లవద్దు. డబుల్​ బెడ్​రూం ఇళ్లు ఉన్న దగ్గరు కాంగ్రెస్​ వెళ్లదు. ఇలా ఉంటే బీఆర్​ఎస్​కు డిపాజిట్లు కూడా గల్లంతు ఖాయం." - రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

Congress Praja Garjana Sabha in Chevella On August 26 : ఈనెల 26న చేవెళ్లలో కాంగ్రెస్​ పార్టీ ప్రజాగర్జన సభ ఉంది.. ఆసభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరుకానున్నారని తెలిపారు. మునుగోడులో కమ్యూనిస్టులతో గెలిచి.. నేడు కమ్యూనిస్టులతో ఒక్క అసెంబ్లీ సీటు ఇవ్వకుండా తెగదెంపులు చేసుకున్నారని విమర్శించారు. బీజేపీ, బీఆర్​ఎస్​ ఒక్కటే అని మరోసారి రుజువు అయిందన్నారు. కేసీఆర్​ దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్​నే ప్రత్యామ్నాయమని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్​ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి కాంగ్రెస్​ను ఓడించాలని చూస్తున్నాయని చెప్పారు.

కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల హామీలు :

  • అధికారం చేపట్టిన ఏడాదిలోపే ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ.
  • అధికారం చేపట్టిన సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు.. ప్రతి సంవత్సరం జాబ్​మేళా
  • ఇళ్లు కట్టుకోవడానికి ప్రతి పేదవాడికి, పెళ్లైన పేద జంటకు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల నగదు.
  • రాజీవ్​ ఆరోగ్య శ్రీని బలోపేతం చేసి రూ.5 లక్షలతో వైద్య ఖర్చులు భరిస్తాం.
  • గ్యాస్​ సిలిండర్​ను రూ.500లకే.
  • ప్రతినెల ఒకటో తేదీన పేదవాళ్లకు ఫించను రూ.4000.

Rekhanayak joing Congress : కాంగ్రెస్‌లో చేరనున్న ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్

Revanth Reddy on BRS Candidates List : 'కేసీఆర్‌ స్వరంలో ఓటమి భయం స్పష్టంగా కనిపించింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.