ETV Bharat / state

revanth-komati reddy: ఒకే వేదికపై రేవంత్​ రెడ్డి, కోమటిరెడ్డి.. కార్యకర్తల్లో సంబరం - telangana varthalu

revanth-komati reddy in vari deeksha: ఆ ఇద్దరు కాంగ్రెస్​ పార్టీలో కీలక నేతలు. ఒక్కరంటే ఒకరికి పడదు. వారు ఇరువురు కలిసి మాట్లాడుకున్న సందర్భాలు తక్కువే. ఆ ఇద్దరు కూడా ఒకే పదవి కోసం శాయశక్తులా యత్నించారు. కానీ ఒకరికే ఆ పదవి దక్కింది. ఒకరు కాంగ్రెస్​ను వీడిపోతారేమో అని కార్యకర్తలు, అధిష్ఠానం అనుకున్నారు. ఆ ఇద్దరు ఎవరూ అని అనుకుంటున్నారా.. ఇంకెవరో కాదు టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి(tpcc chief revanth reddy), భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి(komatireddy)లు. వారిద్దరు ఒకే వేదికపై కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ కార్యకర్తల్లో ఒకింత ఆశ్చర్యం నెలకొంది. వారితో పాటు నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి కూడా వరిదీక్షలో పాల్గొనడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

CONGRESS:  రేవంత్​ రెడ్డి, కోమటిరెడ్డి కలిసినట్లేనా?

author img

By

Published : Nov 27, 2021, 4:42 PM IST

revanth-komati reddy in vari deeksha: రాష్ట్రంలో పండిన వరి ధాన్యం ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ రెండు రోజులు 'వరిదీక్ష'(congress vari deeksha) చేపట్టింది. ఈ దీక్షలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రేవంత్​రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన కోమటిరెడ్డి ఇవాళ ధర్నా చౌక్(dharna chowk)​ వద్ద నిర్వహిస్తున్న దీక్షకు హాజరయ్యారు. ఆయన రాకను గమనించిన రేవంత్‌ రెడ్డి కోమటిరెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. దీక్షకు హాజరైన కోమటిరెడ్డి వేదికపై రేవంత్​రెడ్డి పక్కనే కూర్చున్నారు. కాసేపు వారిద్దరు ముచ్చటించుకున్నారు. ఇవాళ్టి దీక్షకు హాజరుకానున్నట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారమే ప్రకటించి నేడు దీక్షలో పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్​ సీనియర్​ నేత, ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి కూడా పాల్గొనడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

ఫలించిన వీహెచ్​ మంత్రాంగం

రేవంత్​రెడ్డి టీపీసీసీ చీఫ్​గా ఎన్నికైన నాటి నుంచి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా ఎడమొహం, పెడమొడం లాగానే ఉన్నారు. వారి ఇరువురి మధ్య సంధి కుదిర్చేందుకు కాంగ్రెస్​ పార్టీలోని పలువురు సీనియర్లు పలుమార్లు యత్నించారు. గత కొన్ని రోజుల నుంచి పార్టీ సీనియర్​ నేత వి.హనుమంత రావు(vh) రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు వీరితో వీహెచ్​ మంత్రాంగం ఫలించినట్లయింది.

ఆనందంలో అభిమానులు

రేవంత్​రెడ్డి, కోమటిరెడ్డిలు ఒకే వేదికపై కలవడంతో కార్యకర్తలకు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇద్దరూ కలిసి అభివాదం చేయడంతో కార్యకర్తలు, అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. దీక్షలో కలిసి మాట్లాడుకున్న నేతలు.. భవిష్యత్​లో కలిసి పార్టీని ముందుకు నడిపించేందుకు కృషి చేస్తారా?.. దీక్ష అయ్యాకా ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోతారా?.. అనేది రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది.

ఇదీ చదవండి: CONGRESS 'VARI DEEKSHA': ధాన్యం కొనుగోళ్లపై కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో 'వరిదీక్ష'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.