ETV Bharat / state

మోదీని మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకే.. కేసీఆర్​ పర్యటనలు: రేవంత్​ రెడ్డి - revanth reddy on singareni gambling

Revanth Reddy On Singareni: సింగరేణి సంస్థలో భారీ కుంభకోణం జరగబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఆరోపించారు. ఆ సంస్థకు చెందిన ఒడిశాలోని నైని కోల్​మైన్​ టెండర్లలో కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. అవినీతిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్​ జోషిని కోరినా.. ఆయన చేతులెత్తేశారని తెలిపారు. మరోవైపు పలు రాష్ట్రాల నేతలతో సీఎం కేసీఆర్​ చర్చలపై విమర్శలు చేశారు రేవంత్​ రెడ్డి. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏను బలోపేతం చేసేందుకే.. యూపీఏను చీల్చేందుకు కేసీఆర్​ యత్నిస్తున్నారని ఆరోపించారు.

Revanth reddy
రేవంత్​ రెడ్డి
author img

By

Published : Feb 21, 2022, 2:49 PM IST

Updated : Feb 21, 2022, 3:25 PM IST

Revanth Reddy On Singareni: యూపీఏను చీల్చి.. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీని బలపరచేందుకే సీఎం కేసీఆర్​ పర్యటనలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్​కు చిత్తశుద్ధి ఉంటే యూపీ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ప్రచారాలు చేయాలని సవాల్ విసిరారు. కానీ అవేమీ చేయకుండా ఓ వైపు మోదీని విమర్శిస్తూనే.. మరో వైపు ఉత్తరప్రదేశ్​లో గెలిచేది నరేంద్ర మోదీనే అని చెప్పడం.. పలు అనుమాలకు తావిస్తోందన్నారు. అంతకుముందుగా సింగరేణి సంస్థలో రూ. 50 వేల కోట్ల కుంభకోణానికి కుట్ర చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఒడిశాలోని నైని కోల్‌మైన్‌ను అదానీకి కట్టబెట్టనున్నారని ఆయన మండిపడ్డారు. అత్యంత నాణ్యమైన బొగ్గు కలిగిన నైని కోల్‌మైన్‌లో సొంతంగా ఉత్పత్తి చేయకుండా.. సింగరేణి 25 ఏళ్లకు టెండర్లు పిలుస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్​ గాంధీభవన్​లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీని మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకే.. కేసీఆర్​ పర్యటనలు: రేవంత్​ రెడ్డి

రఫేల్​ కంటే పెద్దది

సింగరేణి బొగ్గు గని ప్రైవేటుపరం కాకుండా తెరాస అడ్డుకోలేదని రేవంత్​ రెడ్డి ఆరోపించారు. ఆ అంశంపై పార్లమెంటులో ప్రస్తావించకుండా కేంద్రానికి సహకరించిందని విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఉన్న.. సింగరేణి సీఎండీ శ్రీధర్​ను నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిదేళ్లుగా కొనసాగించడం వెనక కారణం.. నైనీ కోల్‌మైన్‌ను కొల్లగొట్టడమేనని వ్యాఖ్యానించారు. గుత్తేదారులకు అనుకూలంగా సింగరేణి సీఎండీ పనిచేస్తున్నారన్నారు. సింగరేణిలో జరగబోతున్న కుంభకోణం.. రఫేల్​ కుంభకోణం కంటే పెద్దదని పేర్కొన్నారు. అవినీతిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్​ జోషిని కోరినట్లు రేవంత్​ రెడ్డి తెలిపారు. కానీ తాను నిస్సహాయుడినని కేంద్ర మంత్రి చెప్పారని పేర్కొన్నారు.

సింగరేణి సంస్థలో రూ. 50 వేల కోట్ల కుంభకోణం జరగబోతోంది. ఈ కుంభకోణం రఫేల్​ కంటే పెద్దది. ఒడిశాలోని నైని కోల్‌మైన్‌ను అదానీకి కట్టబెట్టబోతున్నారు. సింగరేణి సంస్థకు చెందిన నైని కోల్‌మైన్‌ టెండర్లలో కుట్ర జరుగుతోంది. అవినీతిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరాం. ఏమీ చేయలేనని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. గుత్తేదారులకు అనుకూలంగా సింగరేణి సీఎండీ పనిచేస్తున్నారు. -రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

అందుకే పర్యటనలు

సీఎం కేసీఆర్​ ముంబయి పర్యటనపై సైతం రేవంత్​ విమర్శలు చేశారు. మర్యాదపూర్వకంగా కలుస్తామంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఎవరైనా ఆహ్వానిస్తారని ఎద్దేవా చేశారు. దేశ్‌కీ నేతా అంటూ ఫ్లెక్సీలు పెట్టడంపైనా రేవంత్‌రెడ్డి చురకలంటించారు. డబ్బులిస్తే స్వాగతిస్తూ ఫ్లెక్సీలు పెట్టడం పరిపాటేనన్నారు. సీబీఐ, ఈడీ విచారణలు తప్పించుకునేందుకేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్​కు చిత్తశుద్ధి ఉంటే ఉత్తరప్రదేశ్‌లో సభలు పెట్టాలని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

"కేంద్రంలో ఎన్డీఏను బలోపేతం చేసేందుకు కేసీఆర్​ సుపారీ తీసుకున్నారు. అందుకే యూపీఏ భాగస్వాములను చీల్చేందుకు యత్నిస్తున్నారు. కాంగ్రెస్​తో సంబంధం ఉన్న వ్యక్తులను కలిసి.. వారితో మోదీకి వ్యతిరేకంగా కూటముల గుర్చించి చర్చించినట్లు కేసీఆర్​ చెబుతున్నారు. కానీ వాటిపై స్పందించిన కర్ణాటక, మహారాష్ట్ర ఎంపీలు.. దేవెగౌడ, శరద్​ పవార్​ మాత్రం థర్డ్​ ఫ్రంట్​పై కేసీఆర్​తో చర్చలేమీ చేయలేదని.. వ్యక్తిగత విషయాలు, రాష్ట్రాల అభివృద్ధిపై మాత్రమే చర్చించినట్లు పేర్కొన్నారు." -రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇదీ చదవండి: Shiv sena Mp on KCR: అందరినీ ఏకంచేసే సత్తా కేసీఆర్​కు ఉంది: శివసేన ఎంపీ రౌత్​

Last Updated : Feb 21, 2022, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.