ETV Bharat / state

భాజపా, ఎంఐఎంకు కేసీఆర్ సమన్వయకర్త: రేవంత్ - kcr

ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఉన్న కేసుల విచారణ ఎంత వరకు వచ్చిందో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సమాధానం చెప్పాలని కాంగ్రెస్​ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

భాజపా, ఎంఐఎంకు కేసీఆర్ సమన్వయకర్త
author img

By

Published : Jul 26, 2019, 8:27 PM IST

Updated : Jul 26, 2019, 11:10 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక చేతితో ఎంఐఎంను మరో చేతితో భాజపాను మోస్తూ రెండింటికీ సమన్వయకర్తగా వ్యవహారిస్తున్నారని కాంగ్రెస్​ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టులకు కేంద్రం ఎలాంటి సహాకారం అందించలేదంటున్న కేసీఆర్‌.. రాజ్యసభలో సమాచారహక్కు చట్ట సవరణ బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలని సీఎల్పీలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిమాండ్‌ చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా దిల్లీలో కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌, తెరాస రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ కలిసి మొక్కలు నాటారంటే వాళ్ల బంధం ఎంత దృఢమైందో అర్థమవుతోందన్నారు. కేసీఆర్‌ మీద ఉన్న కేసుల విచారణ ఎంత వరకు వచ్చిందో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి సమాధానం చెప్పాలని రేవంత్‌ అన్నారు.

భాజపా, ఎంఐఎంకు కేసీఆర్ సమన్వయకర్త

ఇవీ చూడండి: మురుగు నీటితో... వ్యవసాయం

sample description
Last Updated : Jul 26, 2019, 11:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.