ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ (Vijayawada Airport) అంతర్జాతీయ విమానాశ్రయానికి.. విదేశీ సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. దుబాయ్ నుంచి 65 మంది ప్రవాసాంధ్రులతో ప్రత్యేక విమానం రాష్ట్రానికి చేరుకుంది. కరోనా కారణంగా ఏప్రిల్ 3 నుంచి తాత్కాలికంగా నిలిచిన విదేశీ సర్వీసులను.. వందేభారత్ మిషన్‌లో భాగంగా పునఃప్రారంభించారు.
ప్రయాణికుల భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ప్రవాసాంధ్రులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఇదీ చదవండి: Corona Baby: కేజీ బరువు కూడా లేని పసికందుకు కరోనా... కాపాడిన వైద్యులు