ETV Bharat / state

కాచిగూడ రైల్వే పునరుద్ధరణ పనులు వేగవంతం - mmts and handri express collided at kachiguda railway station

హైదరాబాద్​ కాచిగూడ రైల్వే స్టేషన్​లో ప్రమాద స్థలాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానంద్​ మాల్య, డీఆర్​ఎం, దిల్లీ నుంచి వచ్చిన రైల్వే బోర్టు సభ్యులు సందర్శించారు. పరిస్థితులు సమీక్షించారు.

కాచిగూడ రైల్వే పునరుద్ధరణ పనులు వేగవంతం
author img

By

Published : Nov 12, 2019, 8:28 AM IST

కాచిగూడ రైల్వే పునరుద్ధరణ పనులు వేగవంతం

హైదరాబాద్​ కాచిగూడలో హంద్రీ ఎక్స్​ప్రెస్​, ఎంఎంటీఎస్​ రైలు ప్రమాద ఘటన తర్వాత రైల్వే శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పునరుద్ధరణ పనులు వేగవంతమయ్యాయి. ఘటనాస్థలిని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానంద్​ మాల్య , డీఆర్​ఎం, దిల్లీ నుంచి వచ్చిన రైల్వేబోర్డు సభ్యులు సందర్శించారు.

మెకానికల్‌, ఎలక్ట్రీషియన్‌, సివిల్‌ ఇంజనీర్లు, ట్రాఫిక్‌ వంటి వివిధ విభాగాల నుంచి దాదాపు ఆరు వందల మంది సిబ్బంది పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. నాలుగు ఎంఎంటీఎస్‌ బోగీలు, హంద్రీ ఎక్స్​ప్రెస్​లో ఒక బోగి దెబ్బతిన్నాయని ఎస్‌సీఆర్‌ జీఎం గజానంద్‌ మాల్య తెలిపారు. మరో ఇంజన్‌ సాయంతో ప్రమాదానికి గురైన ఇంజన్​ను ఎంఎంటీఎస్‌ బోగి నుంచి తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.

ఇప్పటివరకు హంద్రీ ఎక్స్​ప్రెస్‌కు చెందిన ఎనిమిది బోగీలను తొలగించామని, ఎంఎంటీఎస్‌ నాలుగు బోగీలు బాగా దెబ్బతిన్నాయని ఎస్సీఆర్‌ జీఎం గజానంద్‌ మాల్యా తెలిపారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను దారి మళ్ళించిన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

కాచిగూడ నుంచి ఫలక్​నుమా వరకు రాకపోకలు సాగించే ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేశారు. మంగళవారం ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటల నుంచి తిరిగి రాకపోకలు సాగించడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులు, లోకోమో పైలేట్‌ కోలుకుంటున్నారని తెలిపారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.