లాక్‌డౌన్ ప్రభావం వల్ల పూట గడవడమే కష్టంగా మారిన ఏటికొప్పాక కళాకారుల దుస్థితిపై ఈటీవీ భారత్‌లో వచ్చిన'లక్కబొమ్మల గ్రామం వెలవెలబోతోంది' కథనానికి స్పందించారు. బొమ్మల తయారీనే వృత్తిగా నమ్ముకున్న కళాకారులను ఆదుకునేందుకు విశాఖకు చెందిన సింబయాసిస్ కంపెనీ సీఈవో నరేశ్‌కుమార్ ముందుకొచ్చారు.
130 పేద కుటుంబాలకు 10 రోజులకు సరిపడ నిత్యవసరాలను పంపిణీ చేశారు. కళాకారుల నుంచి 12 వేల రూపాయలు విలువైన లక్క బొమ్మలను కొనుగోలు చేశారు. ఆ బొమ్మలను తన స్నేహితులకు చూపించి, మరిన్ని కొనుగోళ్లు చేయించేందుకు తన వంతు ప్రయత్నం చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: 'లక్కబొమ్మల గ్రామం వెలవెలబోతోంది'