ETV Bharat / state

నిధిగా భావించారు... విధిగా ఇంకించారు - secendrabad

గాలి ప్రాణానికి మూలమైతే... జలం జీవనానికి ఆధారం. అందుకే నేటి రోజుల్లో ఎవరి నోట విన్నా జలం మూలం ఇదం జగత్ అనే మాటే. అందిన కాడికి తోడేసుకునేందుకే చూస్తున్న జనం నీటిని ఇంకించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల బోర్లు వట్టిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు సికింద్రాబాద్​లోని ఓ అపార్టుమెంటు వాసులు తీసుకున్న నిర్ణయం వారిని నీటి కష్టాల నుంచి బైటపడేసింది.

నిధిగా భావించారు... విధిగా ఇంకించారు
author img

By

Published : Aug 13, 2019, 8:07 PM IST

జలం లేకుండా బతుకు సాగదని స్వీయ అనుభవంతో గ్రహించిన వారంతా ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టుకుని భూమిలో ఇంకించేందుకు సంకల్పించారు. సికింద్రాబాద్​ పద్మారావునగర్​కు చెందిన బెల్వడర్​ గార్డెన్​ ఫేజ్​వన్​ అపార్ట్​మెంటులో 70 కుటుంబాలు ఉంటున్నాయి. నిత్యావసరాలకు బోరు నీటిపై ఆధారపడిన వారంతా ఎన్నడూ లేనిది ఈ వేసవిలో బోర్లు వట్టిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం వారంతా ఏకమై ఓ నిర్ణయానికొచ్చారు. అపార్టుమెంట్​లో ఇంకుడు గుంతలు నిర్మించుకుని ప్రతీ చుక్కను ఒడిసిపడుతున్నారు.

దొరికిందో శాశ్వత పరిష్కారం

గతంలో అపార్టుమెంటుపై కురిసిన వర్షం నీరంతా వృథాగా పోయేది. ఈ నీటిని ఒడిసి పట్టుకుంటే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా సుమారు రూ.రెండు లక్షలు వెచ్చించి రెండు ఇంకుడు గుంతలు నిర్మించుకున్నారు. 18వేల చదరపు అడుగుల అపార్ట్​మెంటు టెర్రస్​పై కురిసిన వర్షం నీటిని ఇంకుడు గుంతలోకి మళ్లించారు. కాలనీ నుంచి వస్తున్న నీటిని కూడా వృథాగా పోకుండా బైటతీసిన గుంతలో ఇంకేలా ఏర్పాట్లు చేసుకున్నారు.

మూడో వర్షానికే జలకళ

వర్షాకాలం ప్రారంభమై రెండు వర్షాలు వచ్చేసరికి బోర్లు రీఛార్జీ అయ్యాయి. మూడో వాన కురిసే సరికి నీళ్లు ఉబికాయి. ప్రస్తుతం 24 గంటలు పుష్కలంగా నీరొస్తోందని అపార్ట్​మెంట్​ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి నీటి కష్టాలు రాకుండా నగరంలోని అన్ని అపార్టుమెంటుల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ఇంకుడుగుంతల ప్రచారకర్త ఆంజనేయులు అంటున్నారు.

తామంతా ఏకమై తీసుకున్న ఈ నిర్ణయం నీటి కష్టాల నుంచి తమని శాశ్వతంగా బయట పడేసిందని అపార్ట్​మెంట్​ వాసులు సంతోషంగా ఉన్నారు. ప్రతి నీటి బొట్టును నిధిగా భావించి విధిగా అందరూ భూమిలో ఇంకించేందుకు ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే భవిష్యత్తులో నీటి కష్టాలు కొంతమేరకైనా తప్పుతాయి.

నిధిగా భావించారు... విధిగా ఇంకించారు
ఇదీ చూడండి: ఇంటికొక ఇంకుడుగుంత ఉండాలి: దానకిశోర్​

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.