పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి వైద్యుడిపై జరిగిన దాడి ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... రెసిడెంట్ వైద్యులు ధర్నాకు దిగారు. అత్యవసర విభాగం ఎదుట బైఠాయించారు. ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో భద్రత లేకపోవడం వల్ల తరచూ దాడులు జరుగుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. భయాందోళనల మధ్య విధులు నిర్వహించడం కష్టంగా ఉందని తెలిపారు. నిమ్స్ ఆస్పత్రిలో సరైన భద్రతా సిబ్బంది పెంచాలంటూ నినాదాలు చేశారు.
ఇవీ చూడండి: చికిత్స అందించట్లేదంటూ నిమ్స్ వైద్యుడిపై దాడి