చట్టసభల్లో మహిళా ప్రాతినిథ్యం పెరిగినప్పుడే మహిళల హక్కులు, సమస్యలపై మరింత సమర్థంగా పోరాడే అవకాశం ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో గ్రాడ్యుయేట్ అసోసియేషన్, ఎకనమిక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి తలసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
లోకల్ బాడీస్‌లో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం సమాన అవకాశాలు కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోందని.. మండలి, శాసనసభల్లో మహిళల రిజర్వేషన్లు పార్లమెంటు పరిధిలోని అంశమని ఆయన గుర్తు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న విద్యావేత్త సురభి వాణీదేవిని గెలిపించి మండలికి పంపించాలని గ్రాడ్యుయేట్ సొసైటీని మంత్రి అభ్యర్థించారు.
ఎగ్జిబిషన్ సొసైటీ సమస్యలను, మహిళలు పని ప్రదేశాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని మంత్రి అభయమిచ్చారు.
ఇదీ చదవండి: 'అతివల విజయాలకు ప్రతీకగా మహిళా దినోత్సవం'