ETV Bharat / state

Indian Forest Survey Report 2023 : హరితహారం ద్వారా తొమ్మిదేళ్లలో 273 కోట్ల మొక్కల పెంపకం

Telangana Forest Survey Report 2023 Details : ఫారెస్ట్​ సర్వే ఆఫ్​ ఇండియా నివేదిక ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారంగా రాష్ట్రంలో 7.7 శాతం అటవీ విస్తీర్ణం పెరిగిందని తెలిపింది. హరితహారం కార్యక్రమం ద్వారా తొమ్మిదేళ్లలో 273 కోట్ల మొక్కలను ప్రభుత్వం నాటినట్లు పేర్కొంది.

author img

By

Published : Jul 17, 2023, 10:16 PM IST

Report of the Forest Survey of India 2023

Indian Forest Survey Report 2023 Details : పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణకు హరితహారంలో భాగంగా గత తొమ్మిదేళ్లలో 273 కోట్ల మొక్కలను నాటినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఫలితంగా 2015-16లో 19,854 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న అటవీ విస్తీర్ణం.. 2023 నాటికి 26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగినట్లు ప్రకటించింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో 7.70 శాతం అటవీ విస్తీర్ణం పెరిగినట్లు సర్కార్ పేర్కొంది. హరితహారం అమలు, ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

పర్యావరణ సమతుల్యం కాపాడింది : రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో 2015 -16లో తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. కేవలం ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రజలను, రైతులను భాగస్వాములను చేసి ఒక ప్రజా ఉద్యమంగా మలచి ముందుకు నడుపుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. చైనా, బ్రెజిల్ తర్వాత పచ్చదనాన్ని పెంచడంలో అతిపెద్ద మానవ ప్రయత్నంగా ఖ్యాతికెక్కిందన్న సర్కార్​ తెలిపింది. ఈ కార్యక్రమంతో పర్యావరణ సమతుల్యం కాపాడుకోవడంతో పాటు జీవనోపాధి కల్పన, మంచి వర్షపాతం నమోదు అవుతుందని వివరించింది.

Forest Area In Telangana: పెరిగిన అటవీ విస్తీర్ణం.. మెగాసిటీల్లో అగ్రభాగాన హైదరాబాద్

Haritha Haram Scheme in Telangana : ఇప్పటి వరకు 273 కోట్ల మొక్కలు నాటగా.. 700 కోట్లతో 179 చోట్ల అర్బన్ ఫారెస్ట్​లు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో ఒక నర్సరీతో పాటు, 19,472 పల్లె ప్రకృతి వనాలు, 2,275 బృహత్ పల్లె ప్రకృతి వనాలను అభివృద్ధి చేశారు. రహదారులకు ఇరువైపులా మొక్కలను పెద్దసంఖ్యలో నాటి పెంచుతున్నారు. వినూత్నంగా వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో హరితనిధిని ఏర్పాటు చేయడంతో పాటు ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులను భాగస్వామ్యులను చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. దాదాపు లక్ష కిలోమీటర్ల మేర రాష్ట్ర వ్యాప్తంగా రహదారి వనాలు ఏర్పాటు చేయడంతో పాటు 13 లక్షలా 44 వేల ఎకరాల క్షీణించిన అడవులను పునరుద్ధరణ చేస్తున్నట్లు పేర్కొంది.

మొక్కలు పెంచేందుకు బడ్జేట్​లో పదిశాతం : కొత్త పంచాయతీ రాజ్, పురపాలక చట్టాల్లో మొక్కలు నాటి సంరక్షించే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పాటు బడ్జెట్​లో పదిశాతాన్ని హరితబడ్జెట్​కు కేటాయించింది. ఈ ఏడాది 19 కోట్లా 29 లక్షల మొక్కలు నాటలని లక్ష్యంగా నిర్ధేశించారు. అన్ని సాగునీటి ప్రాజెక్టుల స్థలాలు, కాలువల వెంట పచ్చదనం పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హరితహారాన్ని రాష్ట్రంలో మరింతగా అభివృద్ది చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.