పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఫలితాల్లో (CPGET Results 2021) అమ్మాయిలు సత్తా చాటారు. ఉత్తీర్ణులైన వారిలో 64శాతం అమ్మాయిలే ఉన్నారు. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూహెచ్లో సంప్రదాయ పీజీ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన సీపీగెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేశారు.
సీపీగెట్లో 92.51 శాతం విద్యార్థులు (CPGET Results 2021)ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 50 కోర్సుల కోసం నిర్వహించిన సీపీగెట్లో 63 వేల 748 మంది ఉత్తీర్ణులు కాగా... అందులో అమ్మాయిలు 41 వేల 131 మంది... అబ్బాయిలు 22 వేల 614 మంది ఉన్నారు. ఆరు యూనివర్సిటీల్లో కలిపి 41 వేల 174 సీట్లు ఉన్నట్లు కన్వీనర్ పాండు రంగారెడ్డి తెలిపారు. ఈనెల 24 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని లింబాద్రి (Higher Education Council Chairman Limbadri) తెలిపారు. కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలు కూడా అమ్మాయిలు కూడా ఉన్నత విద్యలో అమ్మాయిలు పెరగడానికి కారణవుతోందని ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రవీందర్ అభిప్రాయపడ్డారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల్లో ఫీజులు పెరగనున్నాయని.. ఇప్పటికే పాలక మండలి ఆమోదించిందని వీసీ రవీందర్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఒకే విధమైన ఫీజు ఉండేలా కసరత్తు జరుగుతోందని... అందులో భాగంగా ఓయూ ఫీజులు పెంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులపై భారం ఉండదని.. ఫీజు రీఎంబర్స్మెంట్ పరిధిలోనే పెరుగుతాయని వీసీ తెలిపారు.
ఈనెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు
ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు (Inter 1st year exams 2021) పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) వెల్లడించారు. ఇవాళ వివిధ శాఖల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ (Sabitha Indra Reddy Video Conferance) నిర్వహించారు. గతంలో కరోనా పరిస్థితుల వల్ల ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను రెండో సంవత్సరానికి ప్రమోట్ చేశామని.. అయితే పరిస్థితులు అనుకూలించినప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని ముందే చెప్పామని మంత్రి వివరించారు.
ఇదీ చూడండి: Telangana Inter Exams: విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్ష... 25 నుంచి ఇంటర్ పరీక్షలు