స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ల కోసం ఇటీవల కొనుగోలు చేసిన వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అదనపు కలెక్టర్ల కోసం ఇటీవల 32 కియా కార్నివాల్ కార్లను సమకూర్చారు. రూ. 21.50 లక్షల వ్యయంతో ఒక్కో కారును ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ మేరకు రూ. 6.76 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాల అదనపు కలెక్టర్లకు ప్రభుత్వం కొత్త వాహనాలు సమకూర్చింది. క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లేందుకు 32 కియా కార్నివాల్ కార్లను వారికి అందజేసింది. గ్రామాల్లో పర్యటించేందుకు ఈ వాహనాలను ప్రభుత్వం అందించిన సంగతి తెలిసిందే.
ఇదీ చూడండి: అదనపు కలెక్టర్లకు కియా కార్లు అందించిన ప్రభుత్వం