ETV Bharat / state

Excise Department: గ్రూప్‌-2 ఎస్సైలకు రెగ్యులర్‌ పోస్టింగుల్లో మీనమేషాలు.. వారే కారణమా? - Regular Postings for Group-2 SI in excise department in telangana

గడువు ముగిసినా ఆబ్కారీశాఖలో గ్రూప్‌-2 ఎస్సైలకు రెగ్యులర్‌ పోస్టింగులు ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు తలెత్తున్నాయి. కొత్త మద్యం దుకాణాలు తెరిచే దాకా కొందరు ఈ ప్రక్రియ జరగకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం. కొత్తగా లైసెన్స్‌ పొందిన వ్యాపారులు దుకాణాలను ప్రారంభించే సమయంలో.. గుడ్‌విల్‌ కింద కొంతమొత్తం సమర్పించుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఉన్నతాధికారులు.. ఎస్సైల భర్తీ జరగకుండా అడ్డుకుంటున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

Excise Department
Excise Department in telangana
author img

By

Published : Nov 20, 2021, 8:49 AM IST

తెలంగాణ ఆబ్కారీశాఖ (Excise Department Telangana)లో అడ్‌హాక్‌ ఎస్సైలకు హెడ్‌కానిస్టేబుళ్లుగా రివర్షన్‌ ఇచ్చే అంశంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ఆబ్కారీ శాఖ(Excise Department Telangana)లో గ్రూప్‌-2లో ఎంపికైన ఎక్సైజ్‌ ఎస్సైల (Excise SI) భర్తీకి అనువుగా తాత్కాలికంగా పదోన్నతులు పొందిన అడ్‌హాక్‌ ఎస్సైల (Excise Inspector) స్థాయిని తగ్గించేందుకు ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దానిపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ గత నెలలో 73 మంది అడ్‌హాక్‌ ఎస్సైల (Excise Inspector ) కు నోటీసులు జారీ అయ్యాయి. గడువు ముగిసినా గ్రూప్‌-2 ఎస్సైలను భర్తీ చేయకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి 2020లో విధుల్లో చేరిన 280 మంది గ్రూప్‌-2 ఎస్సైలకు ఏడాదిన్నరగా రెగ్యులర్‌ పోస్టింగులు ఇవ్వలేదు. ఇప్పటికీ పలు స్థానాల్లో అడ్‌హాక్‌ ఎస్సైలు (Excise Inspector ) ఉండటం ఇందుకు అవరోధంగా మారింది. ఈ నేపథ్యంలో వారి స్థాయిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో గ్రూప్‌-2 ఎస్సైలకు మార్గం సుగమమైందనే భావన వ్యక్తమైంది.

వారి తరఫున వకాల్తా

అడ్‌హాక్‌ ఎస్సైల స్థాయిని తగ్గించకుండా జరుగుతున్న ప్రయత్నాల వెనక ‘గుడ్‌విల్‌ గూడుపుఠాణి’ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్సైజ్‌ కొత్త మద్యం పాలసీ (Telangana Government Issues New Liquor Policy) కోసం టెండర్ల ప్రక్రియ నడుస్తోంది. డిసెంబరు 1 నుంచి కొత్తగా లైసెన్స్‌ పొందిన వ్యాపారులు దుకాణాలను ప్రారంభించాల్సి ఉంది. ఆ సమయంలో వ్యాపారులు గుడ్‌విల్‌ కింద కొంతమొత్తం సమర్పించుకునే అవకాశాలున్నాయి. అందువల్లే అడ్‌హాక్‌ ఎస్సైల (Excise Inspector)ను కొన్నిరోజుల పాటు కొనసాగించేలా ఇద్దరు ఉన్నతాధికారులు పావులు కదుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రూప్‌-2 ఎస్సైల కన్నా ‘అనుభవజ్ఞులు’ అయిన అడ్‌హాక్‌ ఎస్సైలు (Excise Inspector) కొనసాగితేనే తమకు సులభంగా ‘ఆదాయం’ లభిస్తుందనే ఉద్దేశం వారికున్నట్లు తెలుస్తోంది. అందుకే పలువురు అడ్‌హాక్‌ ఎస్సై (Excise Inspector)ల తరఫున వీరు వకాల్తా పుచ్చుకోవడమే కాక, వారికి భరోసా ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.