ETV Bharat / state

REGISTRATION INCOME: లక్ష్యాన్ని చేరాలంటే.. రాబడి భారీగా పెరగాల్సిందే..! - తెలంగాణలో తగ్గిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం

రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ(telangana stamps and registration dept) రాబడి ఆరు నెలల్లో నాలుగు వేల కోట్లకు దాటింది(REGISTRATION CHARGES). సెప్టెంబర్ నెలలో 99 వేలకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా రూ.889.90 కోట్లు ఆదాయం వచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన రూ.12,500 కోట్లు మొత్తం లక్ష్యాన్ని చేరుకోవాలంటే వచ్చే ఆరు నెలల్లో... నెలకు సగటున రూ.14 వందల కోట్లకు పైగా మొత్తం రాబడి రావాల్సి ఉంది.

revenue
revenue
author img

By

Published : Oct 1, 2021, 7:10 AM IST

Updated : Oct 1, 2021, 7:36 AM IST

తెలంగాణ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు(Telangana stamps and registration dept) మొదటి ఆరు నెలల్లో 5.49 లక్షలు రిజిస్ట్రేషన్లు ద్వారా రూ.4,008.50 కోట్ల రాబడి వచ్చింది. కరోనా ప్రభావంతో మొదట ఆశించిన మేరకు రిజిస్ట్రేషన్లు జరగలేదు(land registrations). సాంకేతిక కారణాలు, కొవిడ్​ ప్రభావంతో కొన్ని రోజుల పాటు రిజిస్ట్రేషన్ల నిలిచిపోయాయి. ఆ తర్వాత క్రమంగా రిజిస్ట్రేషన్లు పెరుగుతూ వచ్చాయి. సెప్టెంబర్ నెలలో 99,304 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు చేయడం ద్వారా రూ.889.90 కోట్లు రాబడి వచ్చింది. మొదటి ఆరు నెలల కాలంలో వచ్చిన రూ.4008.50 కోట్లు మొత్తం రాబడిని తీసుకుంటే నెలకు సగటున రూ. 668 కోట్లు ఆదాయం వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే విధంగా వచ్చే ఆరు నెలలుపాటు రాబడి వచ్చినట్లయితే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రిజిస్ట్రేషన్ శాఖకు రూ.8 వేల కోట్లకు మించి రాబడి వచ్చే అవకాశం లేదు.

లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారీగా చేయాలి

ప్రభుత్వం నిర్దేశించిన రూ.12,500 కోట్లు లక్ష్యాన్ని చేరుకోవాలంటే రిజిస్ట్రేషన్లు భారీగా చేయాల్సి ఉంది. రాబోయే ఆరు నెలలు పాటు.. నెలకు సగటున రూ.1,416 కోట్లు రాబడి ఉండాలి. అంటే ఇప్పుడు వస్తున్న రాబడి కంటే మరో రూ.526 కోట్లు అదనపు రాబడి రావాల్సి ఉంది.

ఇదే మార్గం

ప్రభుత్వ భూములు ఆస్తుల మార్కెట్ విలువతోపాటు 6 శాతంగా ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజు 7.5 శాతానికి ప్రభుత్వం పెంచింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు సంఖ్య ఆశించిన స్థాయిలో జరగడం లేదు. 2019- 20 ఆర్థిక సంవత్సరంలో 16 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్​ జరిగాయి. వ్యవసాయ భూములు రెవెన్యూశాఖకు పోయినా... ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కేవలం 5,48,000 దస్త్రాలు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగాయి. ఈ సంఖ్య మరింత పెరగడంతోపాటు.. అధిక విలువైన భూములు ఆస్తులు రిజిస్ట్రేషన్​ల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరిగితేనే, ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం సాధ్యమవుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: REGISTRATION CHARGES: ఆగస్టు నెలలో పడిపోయిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం.. ఎందుకంటే!

Last Updated : Oct 1, 2021, 7:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.