ETV Bharat / state

గత పద్దుతో పోలిస్తే పోలీస్‌శాఖకు తగ్గిన కేటాయింపులు - Telangana budget 2021-2022

గతంతో పొలిస్తే బడ్జెట్‌లో పోలీస్‌శాఖకు కేటాయింపులు తగ్గాయి. గతబడ్జెట్‌లో రూ. 629.15 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 586.8 కోట్లు ఇచ్చారు. కొన్ని విభాగాలకు కేటాయింపులు పెరగ్గా మరికొన్నింటికి విభాగాలకు తగ్గించారు. నిఘా విభాగానికి, ఆక్టోపస్‌కు నిధుల్ని పెంచారు.

గత పద్దుతో పోలిస్తే పోలీస్‌శాఖకు తగ్గిన కేటాయింపులు

author img

By

Published : Mar 19, 2021, 5:21 AM IST

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీస్‌శాఖకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. వాటితో పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడం సహా నూతన భవనాలు, పెద్దఎత్తున వాహనాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆశించిన మేర పోలీస్‌ శాఖలో సదుపాయాలు నెలకొనడంతో ఆశాఖకు నిధులు తగ్గించారు.

రాచకొండకు రూ. కోటి..

డీజీపీ కార్యాలయానికి రూ. 21.3 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే అదనంగా మరో రూ. 3 కోట్లు పెరిగింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు రూ. 230.67, సైబరాబాద్‌కు రూ.20 కోట్లు, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌కు రూ. 15.86 కోట్లు కేటాయించారు. రాచకొండ కమిషనరేట్‌ కార్యాలయానికి మరోసారి నిరాశ తప్పలేదు. ఈ ఏడాది కొత్త కార్యాలయానికి రూ. కోటి రూపాయల నిధులిచ్చి సరిపెట్టారు.

రూ. లక్ష మాత్రమే..

హైదరాబాద్‌ పోలీసు టవర్ల నిర్మాణానికి రూ. 125 కోట్లు ఇచ్చిన సర్కారు... యువతులు, మహిళలు, చిన్నారుల భద్రత కోసం మూడు కమిషనరేట్లకు తగినన్ని నిధులు కేటాయించలేదు. షీ బృందాలు, భరోసా కేంద్రాలున్నా వాటి నిర్వాహణకు నిధులు ఇవ్వలేదు. మూడు కమిషనరేట్లకు కలిపి 33 లక్షలు మాత్రమే ఇవ్వగా అందులో రాచకొండ కమిషనరేట్‌కు రూ. లక్ష మాత్రమే ఇవ్వనున్నారు.

తగ్గిన నిధులు..

సేఫ్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా నిర్భయనిధికి రూ. 40 లక్షలే కేటాయించారు. పోలీస్ శిక్షణా కేంద్రాలకు గత బడ్జెట్‌లో రూ. 45 కోట్లు ఇవ్వగా ఈసారి రూ. 25.41 కోట్లే కేటాయించారు. ప్రస్తుతం దాదాపు 20వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీచేస్తామని సర్కారు చెబుతున్న తరుణంలో పోలీస్ శిక్షణా కేంద్రాలకు నిధులు తగ్గించడం గమనార్హం.

ఆక్టోపస్​కు రూ. 6 కోట్లు..

నేరగాళ్లను పట్టుకోవడానికి కావాల్సిన సాంకేతికత అభివృద్ధికి గతంలో రూ. 8 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం.. ఈసారి రూ. 4కోట్లకే పరిమితం చేసింది. జిల్లా పోలీస్ కార్యాలయాలకు గతేడాది రూ. 100 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 50 కోట్లు తగ్గించారు. ఇంటలిజెన్స్ విభాగానికి రూ. 41.6కోట్లు ఇచ్చారు. అంటే గతేడాదితో పోలిస్తే దాదాపు రూ. 30 కోట్లు ఎక్కువగా కేటాయించారు. ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఆక్టోపస్‌కు దాదాపు రూ. 7 కోట్లు ప్రతిపాదించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.