ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా డెంకాడలో 1999లో కేవలం 10 మంది సభ్యులతో ఇందిరా మహిళ పొదుపు సంఘం ప్రారంభించారు. ఒక్కో సభ్యురాలు నెలకు 30 రూపాయల చొప్పున కడుతూ ప్రస్థానం ప్రారంభించారు. ప్రస్తుతం 100 రూపాయల మేర కడుతున్నారు. వీరు కట్టే పొదుపు మెచ్చుకుంటూ ప్రారంభంలో బ్యాంకు ద్వారా 50 వేల రుణం పొంది దానిని సమయానికి కడుతూ బ్యాంకు అధికారుల వద్ద మెప్పు పొందారు.
నేడు బ్యాంకు లింకేజీ ద్వారా, స్త్రీ నిధి ద్వారా సుమారు 30 లక్షల వరకు రుణం తీసుకొని వారి ఆర్థిక లావాదేవీలను కొనసాగిస్తున్నారు. కొందరు టైలరింగ్ వృత్తి, మరికొందరు ఎరువుల దుకాణం, కిరాణా, పాడి పశువుల పెంపకం వంటివి చేసుకుంటూ ధనార్జన చేస్తున్నారు. అలా వచ్చిన డబ్బులతో పిల్లలను పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులుగా స్థిరపరిచినట్లు వారంతా చెబుతున్నారు.
మారుమూల గ్రామంలో ఉన్న ఒక మహిళా సంఘం.. ఆర్థికంగా ఎదగడంపై కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయి అవార్డును ఎంపిక చేసింది. దీనిని మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సత్కరించి.. వారికి మెమొంటో అందజేయనున్నారు.
ఇవీ చూడండి... 'శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలు సాధికారత సాధించాలి'