ETV Bharat / state

హైదరాబాద్‌ తూర్పు దశ మారుతోందా? - it carridor

హైదరాబాద్‌ తూర్పున స్థిరాస్తి మార్కెట్‌ పుంజుకుంటోంది. నివాసాలకు ఇటువైపు చూస్తున్నారు. మెరుగైన మౌలిక వసతులు, బడ్జెట్‌లో సొంతిల్లు వస్తుండటం వల్ల కొనుగోలుదారుల దృష్టిని ఇప్పుడు ఈ ప్రాంతం ఆకర్షిస్తోంది. నిర్మాణదారులు సైతం ఇక్కడ ఆకాశహర్మ్యాలు కడుతున్నారు. ఇరవై అంతస్తులకుపైగా గృహ నిర్మాణాల ప్రాజెక్ట్‌లు ఇప్పటికే కొన్ని సంస్థలు మొదలు పెట్టాయి. ఇన్నాళ్లు పశ్చిమ హైదరాబాద్‌కే పరిమితమైన ఎత్తైన భవంతుల పోకడ ఇక్కడ మొదలు కావడంతో మున్ముందు ఈ ప్రాంతానికి మరింత డిమాండ్‌ పెరుగుతుందనే అంచనాలు ప్రస్తుతం మార్కెట్‌ను నడిపిస్తున్నాయి. భవిష్యత్తులో మరింత వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతంగా పెట్టుబడిదారులు చూస్తున్నారు.

real estate business in hyderabad
హైదరాబాద్‌ తూర్పు దశ మారుతోందా?
author img

By

Published : Sep 5, 2020, 8:35 AM IST

దశాబ్ద కాలానికి పైగా ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల పశ్చిమ హైదరాబాద్‌లోనే వ్యవస్థీకృత స్థిరాస్తి మార్కెట్‌ ఎక్కువగా కేంద్రీకృతమైంది. ఏళ్ల తరబడి మరింతగా విస్తరిస్తూ పోతోంది. ఇక్కడ భూముల ధరలు పెరగడం వల్ల ఎక్కువ మందికి ఇళ్లు అందుబాటులో లేకుండా పోయాయి. కోటి రూపాయల పైన వెచ్చిస్తే తప్ప విశాలమైన ఇంటిని సొంతం చేసుకోలేరు. దీంతో తమ బడ్జెట్‌లో దొరికే అనువైన ప్రాంతాలవైపు కొనుగోలుదారులు దృష్టి సారిస్తున్నారు.

తూర్పున ఉన్న ఉప్పల్‌, ఎల్‌బీ నగర్‌ పరిసరాల ప్రాంతాల వైపు చూస్తుండటంతో కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్లుగా నివాస ప్రాజెక్ట్‌లను బిల్డర్లు చేపడుతున్నారు. ఇదివరకు ఇక్కడ వ్యక్తిగత నివాసాలు ఎక్కువగా ఉండేవి. ఆ తర్వాత ఐదంతస్తుల అపార్ట్‌మెంట్లు వచ్చాయి. కొన్నేళ్ల క్రితమే పది అంతస్తుల భవనాలు వెలిసినా.. సోషల్‌ ఇన్‌ఫ్రా లేమితో ఆ తర్వాత పెద్దగా విస్తరించలేదు. ఇప్పుడు పది దాటి 20 అంతస్తుల అపార్ట్‌మెంట్లు ఈ ప్రాంతంలో వెలుస్తున్నాయి.

మెట్రో మార్గంతో..

నాగోల్‌ నుంచి రాయదుర్గం వరకు, ఎల్‌బీ నగర్‌ నుంచి మియాపూర్‌ వరకు మెట్రో మార్గం పూర్తిగా అందుబాటులోకి రావడం వల్ల ఈ ప్రాంతంలో నివాసాలకు డిమాండ్‌ పెరిగింది. గంటలో మాదాపూర్‌, రాయదుర్గంలోని ఐటీ కార్యాలయాలకు చేరుకునే సౌలభ్యం ఏర్పడింది. దీంతో ఐటీ ఉద్యోగులు, ఇతర రంగాల్లో పనిచేసేవారు సైతం ఇటువైపు చూడటం మొదలు పెట్టారు.

మెరుగైన రవాణా అందుబాటులోకి రావడం, సిటీలోని వరంగల్‌ హైవే మార్గంలో ఆకాశ వంతెనలు వస్తుండటంతో భవిష్యత్తులో ట్రాఫిక్‌ చిక్కులు తొలగనుండటం, విశాలమైన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు,, చేరువలో అవుటర్‌ రింగ్‌ రోడ్డుతో రవాణా అనుసంధానం పెరగడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు రెసిడెన్షియల్‌ హబ్‌లుగా మారుతున్నాయి.

సోషల్‌ ఇన్‌ఫ్రా..

రవాణా ఉన్నప్పటికీ ఇన్నాళ్లు సోషల్‌ ఇన్‌ఫ్రా ఈ ప్రాంతానికి పెద్ద లోటుగా ఉండేది. ఆహ్లాదంగా గడిపేందుకు కావాల్సిన వినోద సదుపాయాలు ఉండేవి కావు. ఇప్పుడు ఇక్కడ కూడా శిల్పారామం అందుబాటులోకి వచ్చింది. నాగోల్‌ మూసీ బ్రిడ్జి పక్కన ఏర్పాటు చేశారు. ఉప్పల్‌లో మల్టీఫ్లెక్స్‌ కొత్తగా ఒకటి ప్రారంభమైంది. ఎల్‌బీ నగర్‌ చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో మల్టీప్లెక్స్‌లు నిర్మాణంలో ఉన్నాయి.

రామోజీ ఫిల్మ్‌ సిటీ వంటి పర్యాటక కేంద్రాలు చేరువలో ఉన్నాయి. ముందు నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరున్న విద్యా సంస్థలు అందుబాటులో ఉన్నాయి. కొత్త విద్యా ప్రాంగణాలు వస్తున్నాయి. వైద్య సదుపాయాలు క్రమంగా మెరగవుతున్నాయి. ప్రైవేటు క్రీడా మైదానాలు పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ నివాస యోగ్యంగా ఈ ప్రాంతానికి డిమాండ్‌ను తీసుకొస్తున్నాయి.

లుక్‌ ఈస్ట్‌తో...

ఉపాధి అవకాశాలు మెరుగు కావడం, ఐటీ సంస్థలు వస్తుండటం కూడా ఈ ప్రాంతం రూపురేఖలు మారడానికి ప్రధాన కారణం. ఇప్పటికే ఉన్న ఐటీ కార్యాలయాలకు తోడుగా కొత్తగా మరిన్ని ఏర్పాటుకు ప్రభుత్వం సైతం లుక్‌ ఈస్ట్‌తో ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఐటీ సెజ్‌లతో ఇప్పటికీ ఎంతోమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పారిశ్రామిక వాడల్లో ఖాళీగా ఉన్న భూముల్లో భవిష్యత్తులో మరిన్ని ఐటీ సంస్థలు రాబోతున్నాయి. పరిశ్రమల్లోనూ ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు.

అందుబాటులో...

నివాసానికి కావాల్సిన అన్ని సౌకర్యాలతో పాటూ ధరలు సైతం అన్నివర్గాలకు అందుబాటులో ఉండటం ఈ ప్రాంతానికి కలిసొచ్చే అంశం. వ్యక్తిగత ఇళ్లు, విల్లాలు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, గెటేడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లు, ఇంటి స్థలాల వెంచర్ల వరకు వారి బడ్జెట్‌లో సొంతం చేసుకోవచ్ఛు ప్రధాన రహదారి చేరువలో అధిక ధరలు ఉన్నా.. లోపలికి, దూరం వెళ్లేకొద్దీ ధరలు అందుబాటులోనే ఉన్నాయి. రూ.75 లక్షల్లో ఆకాశ హర్మ్యాల్లో ఫ్లాట్‌ దొరుకుతోంది. రూ.50 లక్షలకు అటుఇటుగా గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఇల్లు వస్తుంది.

ఇవీ చూడండి: ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 'తెలంగాణ ప్రజా అసెంబ్లీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.