ETV Bharat / state

ఓవైపు సిబ్బందితో శ్రమదానం.. మరో వైపు ఆదాయం

author img

By

Published : Jun 6, 2020, 4:07 AM IST

అక్కడ శిక్షణ పొందతున్న వారంతా పోలీసులు... కానీ వారు చెట్లను శుభ్రం చేయడం, మొక్కలను నీటిని పట్టడం, ఇలా అనేక పనులు చేస్తుంటారు. ఆ పనుల ద్వారా ఆదాయం సమకూరుతోందని ఆ సంస్థ డైరెక్టర్‌ వినయ్‌కుమార్‌ సింగ్‌ చెబుతున్నారు. ఆ మొక్కల నుంచి వచ్చిన పండ్లు, పూలను అమ్మటం ద్వారా లాభం సమకూరుతుందని అంటున్నారు.

rbvrr police training academy Working with training police staff side income
ఓవైపు సిబ్బందితో శ్రమదానం.. మరో వైపు ఆదాయం

ఆర్‌బీవీఆర్‌ఆర్‌ తెలంగాణ రాష్ట్ర పోలీసు శిక్షణ సంస్థను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించినట్టు ఆ సంస్థ డైరెక్టర్‌ వినయ్‌కుమార్‌ సింగ్‌ తెలిపారు. స్వయం సంవృద్ధి దిశగా అడుగులు వేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా శిక్షణ సంస్థ ప్రాంగణంలో పండ్లు, పూల మొక్కలు నాటడం వల్ల వాటిని ప్రజలకు విక్రయిస్తామని ఆయన వివరించారు.

సంస్థలో శిక్షణ పొందుతున్న వారితో సహా... ఇతర సిబ్బంది శ్రమదానం ద్వారా ప్రాంగణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దినట్టు చెప్పారు. పది వేల మామిడి చెట్లను నాటినట్టు తెలిపారు. పండ్లు, పూలు విక్రయించడం ద్వారా ఏటా కోటి రూపాయలు సమకూర్చుకోవాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు.

ఇదీ చూడండి : మొక్క తొలగించినందుకు రూ. 5000 జరిమానా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.