ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం సరఫరా వివిధ ప్రాంతాల్లో ఆలస్యం అవుతోంది. రేషన్ డీలర్లు సకాలంలో రాకపోవడం, మిషన్లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ప్రజలు విసిగిపోతున్నారు.
నారాయణగూడ విఠల్వాడీలో ఉదయం ఏడు గంటల నుంచే రేషన్ సరుకుల కోసం ప్రజలు బారులు తీరారు. తొమ్మిది గంటలకు రావల్సిన డీలర్ సకాలంలో రాకపోవడంతో ఎండలో నిలబడ్డారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉంటూ సామాజిక దూరం పాటించకపోవడంతో... అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు దూరంగా ఉండాలని సూచించారు.
ఇవీచూడండి: పేదలపై లాక్డౌన్ ప్రభావం.. జాగ్రత్త పడకపోతే అంతే!