ETV Bharat / state

RATION DISTRIBUTION: రాష్ట్రంలో నిలిచిపోయిన రేషన్ పంపిణీ

author img

By

Published : Jul 9, 2021, 7:31 PM IST

రాష్ట్రంలో రేషన్ పంపిణీ(RATION DISTRIBUTION) నిలిచిపోయింది. ఆదివారం ఉదయం నుంచి యథావిధిగా రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. డేటా సెంటర్‌(data centre)లో కొత్త యూపీఎస్ అమరుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆన్‌లైన్ ఆధారిత సేవలన్నీ(online services) నిలిచిపోయాయి.

RATION DISTRIBUTION, data centre
రేషన్ పంపిణీ, డేటా సెంటర్

తెలంగాణలో నిత్యావసర వస్తువుల పంపిణీ(RATION DISTRIBUTION) నిలిచిపోయింది. హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర డేటా సెంటర్‌(data centre)లో యూపీఎస్‌ ఆధునీకరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆన్‌లైన్‌ సేవలు(online services) నిలిచిపోయాయి. మీసేవా కేంద్రాలు, ప్రభుత్వ వెబ్‌సైట్లతోపాటు రేషన్ కార్డుదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసరాల పంపిణీ శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు నిలిపివేశారు. ఈ-పీవో సేవలు రేపట్నుంచి నిలిచిపోయి... ఆదివారం ఉదయం నుంచి అందుబాటులోకి వస్తాయి.

హైదరాబాద్ జంట నగరాల్లో అన్ని చౌక ధరల దుకాణాలు(pds shops) తెరిచే ఉంచడంతో లబ్ధిదారులు దుకాణాల వద్దకు వచ్చి ఆరా తీస్తున్నారు. మరో రెండు రోజులపాటు బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ ఉండదని... సోమవారం నుంచి వచ్చి సరుకులు తీసుకెళ్లాలని రేషన్ దుకాణాల డీలర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి యథావిధిగా రేషన్ షాపుల్లో సరకుల పంపిణీ ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

సాంకేతిక కారణాల(techinical issues)తో జరుగుతున్న అంతరాయానికి రేషన్ లబ్ధిదారులు సహకరించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్‌, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాలమాయాదేవి కోరారు. సాంకేతిక సమస్యలు కారణంగా రెండు, మూడు రోజులపాటు పంపిణీని పొడగించనున్నారు. డేటా కేంద్రానికి కొత్త యూపీఎస్ అమర్చడాన్ని ఉన్నత స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న తరుణంలో... ఆదివారం నుంచి రేషన్ పంపిణీ ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: state Data center: నేటి రాత్రి నుంచి నిలిచిపోనున్న మీసేవ, ప్రభుత్వ వెబ్​సైట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.