Ration Dealers Association meet: రాష్ట్రంలో రేషన్ డీలర్లు ఎన్నో ఇబ్బందులు పడుతూనే నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని తెలంగాణ రేషన్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాయికోటి రాజు ఆరోపించారు. చౌక ధరల డీలర్ల సమస్యలపై హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. అవసరమైతే ఏప్రిల్ నుంచి రాష్ట్రాల వారీగా ఆందోళనలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏడేళ్లుగా తమ సమస్యలు పరిష్కరానికి ముఖ్యమంత్రి నుంచి స్పందన రావడం లేదన్నారు. మార్చిలోగా సీఎం జోక్యం చేసుకుని తమ సమస్యలపై పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాని హెచ్చరించారు.
కలిసి పోరాడుదాం: బిస్వబహదూర్ బసు
తెలుగు రాష్ట్రాల్లో రేషన్ డీలర్ల సమస్యలపై కలిసికట్టుగా పోరాడాలని రేషన్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అఖిల భారత కమిటీ కార్యదర్శి బిస్వబహదూర్ బసు సూచించారు. తెలంగాణ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చౌక ధరల దుకాణాల డీలర్ల సమస్యలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో డీలర్లు పాల్గొన్నారు. డీలర్ల కమీషన్ పెంపు, ఈ-పాస్ విధానంలో ఇబ్బందులు, జీవిత బీమా, హమాలీల కూలీ, దుకాణం అద్దెలు, పెండింగ్ బకాయిల చెల్లింపులు సమస్యలు పరిష్కరించాలని ఈ సదస్సులో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత కమిటీ అధ్యక్షుడు దేశ్‌ముఖ్, కోశాధికారి కె.కృష్ణమూర్తి, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: