హైదరాబాద్ లక్డీకపూల్లో తెలంగాణ రాష్ట్ర చౌక ధరల దుకాణాల డీలర్ల సంక్షేమ సంఘం కార్యవర్గం ఎన్నిక జరిగింది. 'ఒకే సంఘం ఒకే నినాదం' అన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన రాష్ట్ర డీలర్ల సమావేశానికి 33 జిల్లాల నుంచి డీలర్లు హాజరయ్యారు. డీలర్ల సంక్షేమ సంఘాల నేతల మధ్య విబేధాలు మరోసారి బట్టబయలయ్యాయి. ఎన్నికల సమయంలో డీలర్లను అన్ని రకాలుగా ఆదుకుంటామన్న సీఎం కేసీఆర్ హామీని నెరవేర్చాలని నూతన అధ్యక్షుడు నాయికోటి రాజు విజ్ఞప్తి చేశారు. గతంలో ఇదే అంశంపై ఒక అడహాక్ కమిటీ ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా దొమ్మాటి రవీందర్‌ను నియమించారు. సంఘాలకు అతీతంగా పాత బకాయిలు విడుదల, కమీషన్ పెంపు, పక్కా గృహాలు, పిల్లలకు విద్యా రాయితీలు కల్పించాలని డీలర్లు కోరారు.
ఇదీ చూడండి :ఈటల గరంగరం... తెరాసలో హాట్ టాపిక్!