ETV Bharat / state

దరఖాస్తు చేసుకున్న అర్హులకు రేషన్‌ కార్డులు.. కేబినెట్​ నిర్ణయం - telangana varthalu

ration cards
దరఖాస్తు చేసుకున్న అర్హులకు రేషన్‌ కార్డులు
author img

By

Published : Jun 8, 2021, 10:26 PM IST

22:16 June 08

దరఖాస్తు చేసుకున్న అర్హులకు రేషన్‌ కార్డులు.. కేబినెట్​ నిర్ణయం

   రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది.  దరఖాస్తు చేసుకున్న అర్హులకు రేషన్‌కార్డులు మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 4,46,169 మంది అర్హులకు రేషన్‌ కార్డులను అధికారులు జారీ చేయనున్నారు. ఈ మేరకు 15 రోజుల్లో రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

   తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా కార్డులు మంజూరు చేసింది. ఆ తరువాత ఆ ప్రస్థావన మళ్లీ రాలేదు. మధ్యలో పలుమార్లు కార్డులు మంజూరు చేయాలని భావించినా.. సాధ్యం కాలేదు. తరువాత కరోనా మహమ్మారి విజృంభనతో ఈ కార్యక్రమం నిలిచిపోయింది. అయితే కొవిడ్ దెబ్బకు చాలా కుటుంబాలు ఉపాధి కోల్పోవడం, ఆహారం కూడా లభించలేని స్థితి ఏర్పడటంతో.. కేబినెట్ అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. 

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.