హైదరాబాద్లోని రాజ్ భవన్లో రక్షబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ దంపతులు దర్బారు హాలుకు చేరుకుని రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ, రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. మొదట బ్రహ్మకుమారీలు గవర్నర్ నరసింహన్కు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలుపగా.. తర్వాత పాఠశాల విద్యార్థినులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులు, స్థానికులు ఒక్కొక్కరుగా రాఖీలు కట్టి తమ సంతోషాన్ని పంచుకున్నారు. రాష్ట్రంలోని మహిళలను రక్షించే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని.. మహిళలకు రక్షణతో పాటు.. విద్య, ఉపాధి తమ ప్రాధాన్యాలని గవర్నర్ అన్నారు.
ఇదీ చూడండి :అడ్వాణీకి జ్వరం... స్వాతంత్ర్య వేడుకలకు దూరం