Rapido Free Rides on Election Polling Day in Hyderabad : ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Election Polling) జరుగుతోంది. అయితే ఎప్పుడు ఎన్నికలు జరిగిన రాష్ట్రవ్యాప్తంగా 70 శాతం పోలింగ్ జరిగితే.. హైదరాబాద్‌లో మాత్రం 55 శాతానికి మించడం లేదు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకోకపోయిన బైక్ ట్యాక్సీలో అగ్రగామి సంస్థ ర్యాపిడో(Rapido) మాత్రం సీరియస్‌గా తీసుకుంది. అందుకు వినూత్నంగా రైడ్ షేరింగ్ అనే వినూత్న కార్యక్రమం చేపట్టనుంది.
ఈ శాసనసభ ఎన్నికలో పోలింగ్ రోజున ర్యాపిడో సంస్థ 2,600 పోలింగ్ బూత్‌లకు ఉచిత రైడ్లను అందిస్తూ.. రైడ్ షేరింగ్(Ride Sharing) అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒక ప్రకటన రూపంలో విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఈ వినూత్న పోగ్రాంకు సిద్ధమైనట్లు ర్యాపిడో సంస్థ తెలిపింది. అయితే ర్యాపిడో కెప్టెన్లంతా ఈ నెల 30న ఉదయం నుంచే రైడ్లకు సిద్ధంగా ఉంటారని ఆ సంస్థ పేర్కొంది. ఓటు వేయాలనే ఓటర్లు (Voters) ర్యాపిడో యాప్‌లో రైడ్ కోరిన వెంటనే వారిని పోలింగ్ బూత్‌ల వద్దకు ఉచితంగా బైక్ మీద తీసుకువెళ్లనున్నారు.
'ఎన్నికలు అయిపోయే వరకు మీరే కాస్త సర్దుకోండమ్మా - ప్రచారాలు ముగియగానే మళ్లీ వచ్చి పనిలో చేరిపోతాం'
Rapido Bike Taxi Free Rides : ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తున్న మనదేశంలో ప్రతి ఓటు(Vote) కీలకమే అని ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి అన్నారు. ఓటుహక్కు అనేది ప్రతి ఒక్కరు ఉపయోగించాలని అది మనకు మన రాజ్యాంగం అందించిన గొప్ప హక్కు అని చెప్పారు. ఈ ఓటుతోనే మనకు నచ్చిన, సుపరిపాలన అందిస్తున్న నాయకుడిని ఎన్నుకోవచ్చన్నారు. అందుకే రవాణా గురించి చింతించకుండా ప్రజలు సౌకర్యవంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ చిన్న ప్రయత్నం గ్రేటర్లో ఓటింగ్ శాతాన్ని పెంచుతుందనే భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకే పోలింగ్ జరిగే ఈరోజు ఉచిత రైడ్లు అందిస్తున్నట్లు వివరించారు. ఈ సేవలను ప్రతిఒక్క ఓటరు ఉపయోగించుకోవాలని కోరారు.
ఈ ఉచిత రైడ్ పొందడం ఎలా..
- ముందుగా ర్యాపిడో బైక్ ట్యాక్సీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- అప్పుడు యాప్ లాగిన్ అయిన తర్వాత ఉచిత రైడ్ సేవలపై వివరాలు ప్రత్యక్షమవుతాయి.
- ఉచిత రైడ్ సేవలలో పోలింగ్ బూత్ ఎక్కడుందో టైప్ చేయాలి.
- అనంతరం కూపన్ కోడ్ వస్తుంది.
- కూపన్ కోడ్ ఉన్న చోట వోట్ నౌ అనే వన్ టైమ్ కోడ్‌ను నమోదు చేయాలి.
- ఇలా చేస్తే ఆ తర్వాత ఉచిత రైడ్ బుక్ అవుతుంది. దీంతో పోలింగ్‌లో ఓటు వేయడానికి ముందుగానే వెళ్లవచ్చు.
అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారిన మైనార్టీల ఓట్లు - దక్కేదెవరికో మరి?
తెలంగాణలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న స్టార్ క్యాంపెయినర్లు - అభ్యర్థులకు ఎంతవరకు కలిసొచ్చేనో?