రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. శనివారం కొనుగోళ్లు నిలిపివేశామని నిర్వాహకులు తెలపగా... అన్నదాతలు సాయంత్రం ఆందోళన చేశారు. స్పందించిన నిర్వాహకులు ఆదివారం తీసుకువస్తే.. కొనుగోళ్లు చేస్తామని హామీ ఇచ్చారు. వారి మాట మేరకు ఆదివారం ఉదయమే రైతులు ధాన్యంతో మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. కానీ ఈ రోజు కూడా ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడంతో ఆగ్రహించిన అన్నదాతలు మరోసారి నిరసన బాటపట్టారు.
జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. కచ్చితంగా ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. రైతుల నిరసనతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు... అన్నదాతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రైతులు ఎంతకీ వినకపోవడంతో తెదేపా జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అక్కడికి వెళ్లి... రైతుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి... వారి సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు చేస్తామని నిర్వాహకులు చెప్పడంతో అన్నదాతలు ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ఇదీ చూడండి: CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ