ETV Bharat / state

'ఆర్థికపరమైన అంశాలే రాంప్రసాద్​ హత్యకు కారణం' - financial issues

వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసు వివరాలను హైదరాబాద్​ పశ్చిమ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ప్రధానంగా ఆర్థికపరమైన అంశాలే ఈ హత్యకు ప్రధాన కారణామని తెలిపారు.

Ramprasad murder case
author img

By

Published : Jul 15, 2019, 5:40 PM IST

Updated : Jul 15, 2019, 6:13 PM IST

వ్యాపారి రాంప్రసాద్​ హత్యకు సంబంధించి ప్రధాన నిందితుడు కోగంటి సత్యంతోపాటు మరో నలుగురిని ఇవాళ అరెస్టు చేసి రిమాండ్​కు తరలిస్తున్నట్లు హైదరాబాద్​ పశ్చిమ డీసీపీ శ్రీనివాస్​ తెలిపారు. రాంప్రసాద్​, కోగంటి సత్యం చాలా ఏళ్లు కలిసి వ్యాపారం చేశారని తమ విచారణలో వెల్లడైందన్నారు. వ్యాపారంలో భాగంగా కోగంటి సత్యంకు రాంప్రసాద్‌ రూ.70 కోట్లు బకాయిపడ్డాడు..కానీ ఇరువురు కలిసి దానిని రూ.23 కోట్లు చెల్లించాల్సిందిగా సెటిల్ చేసుకున్నారు. అప్పు చెల్లింపు విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని డీసీపీ తెలిపారు.

విజయవాడలో ఉన్నప్పుడు కోగంటి సత్యం, ఆయన మిత్రులపై రాంప్రసాద్ కేసులు పెట్టారు. కోగంటి సత్యంతో ఉన్న విభేదాల వల్లే రాంప్రసాద్ విజయవాడ వదిలి హైదరాబాద్‌కు తరలి వచ్చాడని తెలిపారు. డబ్బులు, కేసుల వల్ల రాంప్రసాద్‌పై కక్ష్య పెంచుకన్న సత్యం...శ్యామ్​తో కలిసి రాంప్రసాద్‌ హత్యకు పథకం పన్నాడు. కేసు తనపై రాకుండా రాంప్రసాద్‌ను హత్య చేయించాలని భావించిన సత్యం.. ముగ్గురితో రూ.10 లక్షల సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదర్చుకున్నట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు డీసీపీ. నిందితులు సుమారు నెలరోజుల పాటు రెక్కి నిర్వహించినట్లు చెప్పారు. ఈ హత్య కేసులో మొత్తం ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్​ తెలిపారు.

'ఆర్థికపరమైన అంశాలే రాంప్రసాద్​ హత్యకు కారణం'

ఇవీ చూడండి:భాజపా నేత మురళీధర్​రావుపై హైకోర్టులో పిటిషన్​

Last Updated : Jul 15, 2019, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.